Geetha Krishna : ప‌వ‌న్ నాచుర‌ల్‌.. మ‌హేష్ లో విగ్ త‌ప్ప ఏమీ లేదు.. ప్ర‌భాస్‌కు బుర్ర లేదు.. ద‌ర్శ‌కుడు గీతాకృష్ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

August 13, 2022 9:21 AM

Geetha Krishna : టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ గ్లామరస్ హీరో ఎవరు అనే ప్రశ్న ఎదురైతే ముందుగా గుర్తుకు వచ్చేది సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు. అందానికి నిలువెత్తు రూపం సూపర్ స్టార్ మహేష్. ఎన్నో ఇంటర్వ్యూల‌లో మీ బ్యూటీకి సీక్రెట్ ఏంటి అని మహేష్ ని అడిగితే చిన్న చిరునవ్వుతో తప్పించుకుంటాడు. ఇప్పుడు తాజాగా మహేష్ గ్లామర్ పై దర్శకుడు గీతాకృష్ణ షాకింగ్ కామెంట్స్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో గీతాకృష్ణ పాల్గొని సర్కారు వారి పాట చిత్రంపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

పాత తరం హీరోల సినిమా పేర్లను ఇప్పటి తరం హీరో సినిమాలకు పెడుతున్నారు. ఈ సినిమా పేర్లు ప్రేక్షకులను అంతగా ఆకర్షించలేకపోతున్నాయి అంటూ గీతాకృష్ణ వెల్లడించారు. అంతే కాకుండా ఈ చిత్రంలో మహేష్ బాబు చూడడానికి వింటేజ్ లుక్ లో కనబడుతున్నాడు అంటూ కొందరు  రివ్యూ ఇచ్చారు. ఇదే విషయంపై గీతాకృష్ణ స్పందిస్తూ వింటేజ్ లుక్ లో కనిపించడం ఏంటి అప్పటికీ ఇప్పటికీ మహేష్ బాబు విగ్ మెయింటైన్ చేస్తూనే స్టార్ అయ్యాడు. ఒక పవన్ కళ్యాణ్ తప్పితే సుమారు అందరూ విగ్ తో నటించేవారే. విగ్ తప్ప మహేష్ బాబులో  ప్రత్యేకమైన అందం ఏమీ లేదు.. అంటూ మహేష్ బాబుపై  షాకింగ్ కామెంట్స్ చేశారు.

Geetha Krishna sensational comments on Mahesh Babu and Prabhas
Geetha Krishna

గీతాకృష్ణ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని కూడా వదల్లేదు. ప్రభాస్ విగ్ పెట్టుకోడు గానీ, అతని హెయిర్,  బాడీ కటౌట్ అదిరిపోయేలా ఉంటుంది. ఎత్తుకు ఎదిగాడు గానీ ప్రభాస్ కి బుర్ర లేదు అంటూ గీతాకృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. భారీ బడ్జెట్ చిత్రాలను ఎంచుకుంటున్నాడు గానీ  బుర్ర లేకపోవడం వల్లనే ఇలాంటి కథలను ఎంచుకోవాలి అనే విషయంపై అవగాహన లేకుండా పోతుంది అంటూ గీతాకృష్ణ ప్రభాస్ పై కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో గీతాకృష్ణ టాలీవుడ్ పాపులర్ హీరోలపై సంచలమైన వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో ఈ విష‌యం హాట్ టాపిక్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now