Bigg Boss : ఈ సారి బిగ్ బాస్ సీజ‌న్‌లో.. ప్రముఖ న్యూస్ చాన‌ల్ యాంక‌ర్‌..?

August 19, 2022 2:33 PM

Bigg Boss : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించిన రియాలిటీ షో బిగ్ బాస్. ఈ రియాలిటీ షో ఇప్పటి వరకు ఐదు సీజన్లు పూర్తి చేసుకొని ఆరవ సీజన్ లోకి అడుగుపెట్టబోతోంది. కాగా గ‌తంలో ఓటీటీలో వ‌చ్చిన ఈ షో నాన్ స్టాప్ గా 24 గంటలు అందరినీ మెప్పించింది. ఇటీవల విడుదలైన బిగ్ బాస్ సీజన్ 6 ప్రోమో కూడా అదిరిపోయింది. బిగ్ బాస్ సీజన్ 6 కు కూడా నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ షోకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా బిగ్ బాస్ షోల‌లో అనేక ప్రముఖ రంగాలకు సంబంధించిన పోటీదారులు హౌస్‌లో పాల్గొంటున్నారు. కానీ మన తెలుగు బిగ్ బాస్ షోలో ఎక్కువ శాతం నటులు, యాంకర్లు, సోషల్ మీడియా ద్వారా గుర్తింపు పొందిన వారిని ఎంపిక చేస్తున్నారు.

this famous news channel anchor pratyusha may join in Bigg Boss show
Bigg Boss

అదే విధంగా ప్రతి సంవత్సరం టీవీ9 న్యూస్ ఛానల్ నుంచి ఒక పోటీదారును బిగ్ బాస్ హౌస్ లోకి ఎంపిక చేస్తున్నారు. దీప్తి, జాఫర్, దేవి నాగవల్లి వంటివారు గత షోలలో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే సీజన్ 5 లో టీవీ 9 నుంచి ఏ సెలబ్రిటీ కూడా హౌస్ లోకి అడుగు పెట్టలేదు. కానీ సీజన్ 6 లో ప్రముఖ న్యూస్ రీడర్ ప్రత్యుష ఈ షో లోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది.

అదేవిధంగా ఆమె ఓ మెగా డీల్ పై సంతకం చేసినట్లు కూడా వార్తలు వ‌స్తున్నాయి. ప్రతి సంవత్సరం టీవీ9 జర్నలిస్టు లేదా న్యూస్ రీడర్ తోపాటు మరొక టీవీ ఛానల్ నుండి కూడా న్యూస్ రీడర్ లేదా జర్నలిస్ట్ బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశిస్తూ ఉంటారు. ఈసారి బిగ్ బాస్ సీజన్ 6 లో హౌస్ లోకి ప్రత్యూషతో పాటు ఎవరు ప్రవేశిస్తారు.. అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇక దీనిపై త్వ‌ర‌లోనే స్ప‌ష్ట‌త రానుంది. కాగా సీజ‌న్ 6 ను ఆగ‌స్టు చివ‌రి వారంలో లేదా సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో ప్రారంభిస్తార‌ని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now