Tiger Nageswara Rao : టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావుకు.. బింబిసార టెక్నాలజీ..?

August 19, 2022 2:33 PM

Tiger Nageswara Rao : యువ దర్శకుడు వశిష్ట  ఒక పవర్ ఫుల్ కథాంశంతో ప్రేక్షకులను ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు. బింబిసార చిత్రంతో హీరో కళ్యాణ్ రామ్ కెరియర్‌లో మర్చిపోలేని బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద బింబిసార చిత్రం నిర్మాతలకు కనకవర్షం కురిపిస్తోంది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం భారీ వసూళ్ల‌ను రాబడుతూ రూ.వంద కోట్ల సినిమా క్లబ్‌లో చేరుకోవడానికి దూసుకుపోతోంది.

ఇప్పుడు ఈ చిత్రంపైనే యాక్టివ్ ప్రొడ్యూసర్ గిల్డ్ లో జరుపుతున్న చర్చలు కొత్త మలుపులు తీసుకున్నాయి. బాహుబలి, కేజీఎఫ్ వంటి చిత్రాల భారీ బడ్జెట్ తో పోల్చినప్పుడు, తక్కువ బడ్జెట్ తో విజువల్ ఎఫెక్ట్స్ చేసే అవకాశం ఇతర నిర్మాతలకు ఆసక్తికరమైన విషయంగా మారింది.

Bimbisara movie technology may be used for Tiger Nageswara Rao
Tiger Nageswara Rao

బింబిసార బృందం పని నైపుణ్యం అందరినీ ఎంతగానో ఆకర్షించింది. బింబిసారకు ప్రయోగించిన విజువల్ ఎఫెక్ట్స్, రియలిస్టిక్ లుక్ అంద‌రినీ మంత్రముగ్ధుల్ని చేసేస్తున్నాయి. అయితే రవితేజ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న‌ చిత్రం టైగర్ నాగేశ్వరరావుకి కూడా బింబిసార చిత్రం మంచి స్ఫూర్తినిచ్చింది. టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో 1960, 80 కాలాన్ని చూపించ‌డానికి ఇలాంటి సాంకేతిక నైపుణ్యం ఉపయోగించనున్నారు.

టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో స్టువర్ట్ పురం గ్రామం సెట్‌ను రూపొందించడానికి బింబిసార బృందం ఉపయోగించిన విజువల్ ఎఫెక్ట్స్ సాఫ్ట్ వేర్ సాంకేతిక నైపుణ్యాన్ని ఉప‌యోగించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇలా టెక్నాల‌జీని వాడుకోవడానికి గల కారణం ఏమిటంటే.. ఇప్పటికే టైగర్ నాగేశ్వరరావు బృందం హైదరాబాద్‌లో రెండుసార్లు, రామోజీ ఫిలిం సిటీలో రెండుసార్లు, శంషాబాద్ ప్రాంతంలో మరొకసారి స్టువర్ట్ పురం గ్రామం సెట్స్ ను నిర్మించింది.

టైగర్ నాగేశ్వరరావు చిత్ర బృందానికి సీజీలో డిజిటల్ పొడిగింపును రూపొందించడంలో సవాల్ గా మారింది. ఇప్పుడు బింబిసార సాంకేతిక నైపుణ్యం ఒక మార్గం చూపించ‌డంతో రవితేజ టైగర్ నాగేశ్వరరావు చిత్ర బృందానికి కొత్త ఆశలు మొలకెత్తినట్లు అయింది. దీంతో బింబిసార టెక్నాల‌జీనే ఉప‌యోగించాల‌ని టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు టీమ్ ఆలోచిస్తోంది. ఇక వారి ప్ర‌య‌త్నం ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment