Pawan Kalyan : ప‌వ‌న్ క‌ల్యాణ్, మ‌హేష్ బాబు మ‌ల్టీ స్టార‌ర్ మూవీ..? ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌..?

August 11, 2022 11:49 AM

Pawan Kalyan : టాలీవుడ్ దర్శకులు ఎందరో ఉన్నారు, కానీ త్రివిక్రమ్ రూటే సపరేటు అని చెప్పవచ్చు. రచయితగా, దర్శకుడిగా త్రివిక్రమ్ మాటలతో ప్రేక్షకులను మాయ చేస్తూ ఉంటాడు. అందుకే త్రివిక్రమ్ మాటల మాంత్రికుడు అయ్యాడు. తన సినిమాలతో అన్ని వర్గాల వారిని అలరిస్తూ టాప్  దర్శకుల లిస్టులో చేరిపోయారు. 2005 సంవత్సరంలో త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో వచ్చిన అతడు చిత్రం ఎంత బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుందో వేరే చెప్పనవసరం లేదు.

ఈ చిత్రానికి గాను జయభేరి ఆర్ట్స్ సంస్థ నిర్మాణ సారథ్యం వహించింది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. నాజర్, సునీల్, గిరిబాబు ధర్మవరపు సుబ్రమణ్యం, ప్రకాష్ రాజ్, సోనుసూద్, కోట శ్రీనివాసరావు వంటి వారు ప్రధాన పాత్రల‌లో నటించారు. మణిశర్మ ఈ చిత్రానికి ఎంతో అద్భుతమైన సంగీతాన్ని అందించారు.

director trivikram plans movie on Pawan Kalyan and Mahesh babu
Pawan Kalyan

అప్పట్లో  మొదటగా ఈ చిత్రానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను హీరోగా అనుకున్నారట దర్శకుడు త్రివిక్రమ్. కథ పరంగా పవన్ కళ్యాణ్ తో చర్చలు జరుపుతుండగా పవన్‌ నిద్రలోకి చేరుకోవడంతో పవన్ కి కథ నచ్చలేద‌ని దర్శకుడు త్రివిక్రమ్ వెనుతిరిగి వెళ్లిపోయారట. ఆ తర్వాత అతడు చిత్ర కథతో మహేష్ బాబును సంప్రదించగా మహేష్ ఎంతో ఇంట్రెస్టింగ్ కథ అని వెంటనే ఓకే చెప్పేశాడట. ఇలా అతడు చిత్రం కాంబినేషన్ తో వీళ్ళిద్దరూ మంచి సక్సెస్ ను అందుకున్నారు.

ఇప్పుడు అతడు చిత్రంపై తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక వార్త హల్ చల్ చేస్తోంది. అతడు చిత్రం సీక్వెల్ రాబోతోంది అంటూ వార్తలు ప్రచారం అవుతున్నాయి. అతడు సీక్వెల్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో సినిమా చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.  అప్పటికే అతడు సీక్వెల్ పై మహేష్ బాబుతో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా ఈ చిత్ర నిర్మాత, జయభేరి ఆర్ట్స్ సంస్థ అధినేత మురళీమోహన్ కూడా అతడు సీక్వెల్ పై ఎంతో ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారట. ఇదే నిజమైతే అటు పవర్ స్టార్, ఇటు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు పండగే పండగ అని చెప్పవచ్చు. మరి వీరిద్దరి కలయికలో సినిమా ఎప్పుడు  ప్రారంభం కాబోతుంది.. అనేది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now