Allu Arjun : దటీజ్‌ పుష్పరాజ్‌.. ఆ యాడ్‌ కోసం బన్నీకి రూ.10 కోట్ల ఆఫర్‌.. ఎందుకు నో చెప్పాడో తెలుసా ?

August 11, 2022 10:23 AM

Allu Arjun : టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ పుష్పతో ఐకాన్‌ స్టార్‌గా మారాడు. పుష్ప సినిమా విడుదల తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు బన్నీ. తన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టైలిష్ స్టార్‌ మరోవైపు వాణిజ్య ప్రకటనలతోనూ కోట్లు గడిస్తున్నాడు. ఇప్పటికే పలు కంపెనీల ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్కో యాడ్‌కు రూ.7.50 కోట్ల రెమ్యునేషన్‌ తీసుకుంటున్నాడని తెలుస్తోంది.

అల్లు అర్జున్ కు ఉన్న క్రేజ్‌ను ఓ గుట్కా అండ్‌ లిక్కర్‌ కంపెనీ కూడా వినియోగించుకోవాలనుకుందట. తమ సంస్థ బ్రాండ్ ఉత్పత్తులను ప్రమోట్‌ చేస్తే ఏకంగా రూ.10 కోట్ల పారితోషకం ఇస్తామని ఆఫర్‌ చేశారట. అయితే ఐకాన్‌ స్టార్‌ మాత్రం ఆ యాడ్‌ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడట. జనాల ఆరోగ్యానికి హానికరం కలిగించే అలవాట్లను ప్రోత్సహించే ఉద్దేశం లేని బన్నీ ఆ భారీ ఆఫర్‌ను ఏ మాత్రం ఆలోచించకుండా తిరస్కరించినట్లు తెలుస్తోంది.

Allu Arjun reportedly said no to an ad offered by a company
Allu Arjun

ఇలాంటి యాడ్స్‌లో నటిస్తే అభిమానులతోపాటు ఆడియన్స్‌లో కూడా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందని బన్నీ ముందు జాగ్రత్తగా ఆ సంస్థలకు నో చెప్పినట్లు తెలుస్తోంది. ఐకాన్ స్టార్ నిర్ణయంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలియడంతో తమ హీరోది మంచి మనసంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు షేర్‌ చేస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే దేవిశ్రీప్రసాద్‌ సారథ్యంలో మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ కూడా జరిగాయి. పుష్ప ది రూల్‌ పేరుతో మొదటి భాగం కంటే మరింత గ్రాండ్‌ గా సుకుమార్‌ ఈ సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ కాస్త ఆలస్యమైనా సరే పక్కాగా వెళ్లాలని సుకుమార్ భావిస్తున్నాడట. మొదటి భాగంలో నటించిన వారితోపాటు విజయ్ సేతుపతి కూడా జత కావడంతో.. ఆయన క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now