పెళ్లి పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి అంజలి..

June 8, 2021 10:07 PM

లాక్‌డౌన్‌ సమయంలో చాలా మంది సినీ తారలు వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. తాజాగా నటి ప్రణీత పెళ్లి చేసుకోగా యామిగౌతమ్ సైతం వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే తెలుగు హీరోయిన్ అంజలి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న అనే వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న అంజలి తరువాత పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ చిత్రం ద్వారా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో అంజలికి పలు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్రమంలోనే అంజలి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న వార్తలు జోరుగా వినిపించడంతో వాటి పై స్పందించిన అంజలి ఆ రూమర్లకు చెక్ పెట్టారు. ప్రస్తుతం తనకు పెళ్లి ఆలోచన లేదని తన ధ్యాస మొత్తం తన కెరీర్ పైనే ఉందని తనపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment