రూ.30 కోట్లు పెట్టి నిర్మిస్తే.. సీతారామంకు ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత వ‌చ్చిందో తెలుసా..?

August 19, 2022 2:28 PM

ఆగస్టులో విడుదలైన చిత్రాల్లో సీతా రామం బెస్ట్ మూవీ గా చెప్పవచ్చు. ఈ చిత్రానికి గాను హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్స్ గా నటించారు. మృణాల్ ఠాకూర్  సీతారామం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. రష్మిక మందన్న ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. సుమంత్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, ప్రకాష్ రాజ్, భూమిక, గౌతమ్ మీనన్ వంటి వారు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు.

విశాల్ చంద్రశేఖర్ సీతారామం చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం మంచి క్లాసిక్ లవ్ స్టోరీ అని చెప్పవచ్చు. దర్శకుడు ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు ఒక మంచి లవ్ స్టోరీని అందించాడు. ప్రస్తుతం ఈ చిత్రం బింబిసార చిత్రంతో పోటీ పడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. సీత కోసం రామ్ రాసిన ఉత్తరాన్ని  ఆఫ్రీన్ (రష్మిక) అందజేయడం కోసం బయలుదేరుతుంది. ఎన్నో ట్విస్టులతో క్లాసిక్‌ లవ్ స్టోరీగా ముందుకు సాగుతోంది ఈ చిత్ర కథాంశం.

sita ramam movie huge hit at box office know the collections details

ప్రేక్షకులలో మంచి హిట్ టాక్ ని అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టుకుంటూ ముందుకు దూసుకుపోతోంది సీతారామం. గీతాంజలి,  తొలిప్రేమ, ఇప్పుడు సీతారామం.. అంటూ మంచి ప్రేమ కథాంశం అంటూ ఈ చిత్రంపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచే కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఐదు రోజుల్లోనే ఈ చిత్రం రూ.30 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ప్రేక్షకుల నుంచి సీతారామం చిత్రానికి  వచ్చిన ఆదరణను చూస్తుంటే రూ.100 కోట్ల‌ వసూలు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని సినీ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. కాగా సీతారామం మూవీకి గాను రూ.30 కోట్లు పెట్టి నిర్మించారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.17 కోట్ల వ‌ర‌కు జ‌రిగింది. మొత్తంగా చూస్తే ఇప్ప‌టికే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీకి ఇప్ప‌టి వ‌ర‌కు అన్ని హ‌క్కులు క‌లిపి రూ.60 కోట్లు వ‌చ్చాయ‌ని చెబుతున్నారు. అంటే పెట్టిన దానికి రెట్టింపు మొత్తం వ‌చ్చింద‌ని అర్థం. ఇక ఇలాగే గ‌న‌క ఈ మూవీ కొన‌సాగితే రూ.100 కోట్ల క్ల‌బ్‌లో చేరుతుంద‌ని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment