నాగ‌చైత‌న్య ఒక్క సినిమా రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా ? షాక‌వుతారు..!

August 19, 2022 2:24 PM

అక్కినేని నాగ‌చైత‌న్య లేటెస్ట్‌గా న‌టించిన మూవీ.. థాంక్ యూ. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. రెండో రోజే సినిమాకు క‌లెక్ష‌న్స్ దారుణంగా ప‌డిపోయాయి. ల‌వ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాల త‌రువాత ఈ మూవీ ఫ్లాప్ అయింది. అయితే ఈ నెల 11వ తేదీన చైతూ న‌టించిన లాల్ సింగ్ చ‌డ్డా మూవీ రిలీజ్ కానుంది. బాలీవుడ్‌లో చైత‌న్య‌కు ఇదే తొలి మూవీ కాగా.. దీనికి నాగార్జున సైతం ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తున్నారు. ఇక తెలుగులో ఈ మూవీని అల్లు అర‌వింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ స‌మ‌ర్పిస్తోంది.

లాల్ సింగ్ చ‌డ్డా మూవీలో నాగ‌చైత‌న్య బాల‌రాజు పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. ఇందులో ఆయన పాత్ర నిడివి 15 నిమిషాలు ఉంటుంద‌ని తెలిసింది. ఇందులో అమీర్‌ఖాన్ స్నేహితుడి పాత్ర‌లో చైతూ క‌నిపించ‌నున్నాడ‌ట‌. అయితే చైత‌న్య రెమ్యున‌రేష‌న్ విష‌యం ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆయ‌న ఒక్క సినిమాకు ఎంత తీసుకుంటున్నాడు.. అనే విష‌యంపై అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు.

naga chaitanya remuneration for one movie you will be surprised to know

నాగ‌చైత‌న్య వాస్త‌వానికి త‌న‌కు ఫ‌లానా మొత్తం కావాల‌ని ఏనాడూ నిర్మాత‌ల‌ను అడ‌గ‌లేద‌ట‌. వారు ఎంత ఇస్తే అంతే తీసుకుంటున్నాడ‌ట‌. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు చైతూ ఒక్క మూవీకి రూ.10 కోట్లు తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. కానీ లాల్ సింగ్ చ‌డ్డాకు మాత్రం రూ.5 కోట్లు తీసుకున్నాడ‌ట‌. ఎందుకంటే అందులో ఆయ‌న‌ది పూర్తి నిడివి ఉన్న పాత్ర కాదు. ఇక యంగ్ హీరోల్లో ప్ర‌స్తుతం అల్లు అర్జున్ రెమ్యున‌రేష‌న్ ఎక్కువ‌గా ఉంది. ఈయ‌న ఒక్క సినిమాకు రూ.70 కోట్లు తీసుకుంటున్నారు. పుష్ప 2 కు అయితే బ‌న్నీ ఏకంగా రూ.120 కోట్లు వ‌సూలు చేస్తున్నాడ‌ని టాక్‌. అయిన‌ప్ప‌టికీ చైత‌న్య మాత్రం చాలా త‌క్కువ‌గానే రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుండ‌డం అంద‌రినీ షాక్‌కు గురి చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment