నాగ‌చైత‌న్య‌కు ఆ ప‌ని చేయ‌డం ఇష్టం లేద‌ట‌.. నాగార్జున బ‌ల‌వంత‌పెట్టార‌ట‌..?

August 19, 2022 2:21 PM

అక్కినేని సినీ వారసుడిగా జోష్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు నాగ చైతన్య. మొదటి చిత్రంతోనే పరాజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తర్వాత ఏం మాయ చేశావె చిత్రంతో ప్రేక్షకులను మాయ చేసి బాక్సాఫీస్ వద్ద హిట్ ను చేజిక్కించుకున్నాడు. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస ఆఫర్లను అందిపుచ్చుకుంటూ హీరోగా  మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

గత ఏడాది అక్టోబర్ లో సమంతతో వివాహ బంధానికి స్వస్తి చెప్పాడు. విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది నాగచైతన్య పేరు. సమంత కూడా సోషల్ మీడియా వేదికగా నాగ చైతన్యపై పరోక్షంగా కామెంట్స్ చేస్తూనే ఉంది. ఎన్ని కామెంట్స్ ఎదురైనా కూడా ఆయన పని ఆయన కూల్ గా చేసుకుంటూ పోతున్నాడు. వ్యక్తిగతంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా సినిమాలను మాత్రం దూరం పెట్టలేదు.

naga chaitanya did lal singh movie upon nagarjuna request

నాగచైతన్య ప్రస్తుతం లాల్ సింగ్ చడ్డా చిత్రంలో అమీర్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఈ చిత్రంలో నాగచైతన్య ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో నాగచైతన్య క్యారెక్టర్ పేరు బాలరాజు అని వార్తలు వినిపిస్తున్నాయి. మొదట లాల్ సింగ్ చడ్డాలో నటించడానికి నాగచైతన్య ఇష్టం చూపించలేదంట. సినిమా కథ వినే సమయంలో సమంతతో వ్యక్తిగత గొడవలు జరుగుతూ ఉండడంతో నటించడానికి నో చెప్పాడ‌ట.

నాగచైతన్యకు ఇష్టం లేకపోయినా నాగార్జున దగ్గరుండి మరీ ఈ చిత్ర కథకు సైన్ చేయించారట. ఇటీవల విడుదలైన నాగచైతన్య థాంక్యూ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. మరీ లాల్ సింగ్ చడ్డా చిత్రంతో నాగ చైతన్య బాలీవుడ్ లో ఎలాంటి విజయం అందుకుంటాడో వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment