శ్రేయాస్ అయ్య‌ర్ ఔట్‌.. ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్‌గా రిష‌బ్ పంత్‌..

March 30, 2021 10:23 PM

ఐపీఎల్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ టీమ్‌కు రిషబ్ పంత్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 14వ ఎడిష‌న్ ప్రారంభ‌మ‌వుతున్న విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే ఢిల్లీ జ‌ట్టుకు రిష‌బ్ పంత్ నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. అంత‌కు ముందు శ్రేయాస్ అయ్య‌ర్ ఢిల్లీ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే ఇటీవ‌ల ఇంగ్లండ్‌తో జ‌రిగిన వన్డే సిరీస్‌లో అయ్య‌ర్ కు గాయం అయింది. దీంతో జ‌ట్టు యాజ‌మాన్యం పంత్‌ను కెప్టెన్‌గా నియ‌మించింది. ఈ మేర‌కు ఢిల్లీ ఒక ప్ర‌క‌ట‌నలో తెలిపింది.

rishabh pant appointed as delhi capitals captain

కాగా పంత్ తొలిసారిగా ఐపీఎల్ జ‌ట్టుకు కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్ట‌బోతున్నాడు. గ‌తంలో పంత్ ఢిల్లీ రాష్ట్ర జ‌ట్టుకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు. అయితే ఐపీఎల్‌లో కెప్టెన్సీ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌బోతుండ‌డం ఇదే తొలిసారి. దీంతో పంత్ కెప్టెన్‌గా ఎలా రాణిస్తాడు ? అన్న విష‌యం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇక త‌న‌కు కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌డంపై పంత్ స్పందిస్తూ.. త‌న‌ది ఢిల్లీ అని, అక్క‌డే పుట్టి పెరిగాన‌ని, ఇప్పుడు ఆ జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హిస్తుండ‌డం ఆనందంగా ఉంద‌ని అన్నాడు. త‌న‌కు ఈ బాధ్య‌త‌లు అప్ప‌గించినందుకు అతను జ‌ట్టు యాజ‌మాన్యానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. త‌న‌పై ఉంచిన న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కుండా ప‌నిచేస్తాన‌ని, ఈ ఎడిష‌న్‌లో ఢిల్లీకి ఐపీఎల్ టైటిల్‌ను అందించేందుకు కృషి చేస్తాన‌ని తెలిపాడు.

కాగా ఢిల్లీ క్యాపిట‌ల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ గ‌త రెండు సీజ‌న్ల‌కు శ్రేయాస్ అయ్య‌ర్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ సీజ‌న్ల‌లో అత‌ను కెప్టెన్ గా రాణించాడు. పంత్‌కు ఇదొక చ‌క్క‌ని అవ‌కాశం. ఇంగ్లండ్ తో సిరీస్‌లో బ్యాట్‌తో రాణించాడు. ఇప్పుడు కెప్టెన్‌గా రాణించాల‌ని కోరుకుంటున్నాన‌ని తెలిపాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment