పుష్ప 2 కోసం ర‌ష్మిక తీసుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

August 6, 2022 12:52 PM

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి గుర్తింపు రావ‌డానికి కొంత టైం ప‌డుతుంది. అదే కొంద‌రు న‌టీమ‌ణులు మాత్రం ఒక‌టి రెండు సినిమాల‌తోనే స్టార్ స్టేట‌స్‌ను సొంతం చేసుకుంటారు. అలా ఓవ‌ర్ నైట్ స్టార్ అయిన క‌థానాయిక ర‌ష్మిక మంద‌న్న‌. ఛలో సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ తన సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే నేషనల్ క్రష్ గా మారింది.

పుష్ప సినిమాతో రష్మిక గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. పుష్పలో రష్మిక డీగ్లామర్ రోల్ చేసినప్పటికీ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా బాలీవుడ్ కన్ను రష్మికపై పడింది. పుష్ప విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రస్తుతం రష్మికకు ఇన్‌స్టాగ్రామ్‌ లో 6 మిలియన్లకు పైగా ఫాల్లోవర్స్ ఉన్నారు.

do you know how much Rashmika Mandanna taking remuneration

రష్మిక క్రేజ్, డిమాండ్‌ పెరిగిపోవడంతో రెమ్యూనరేషన్ కూడా పెంచేసిందట. పుష్ప విడుదలకు ముందు ఆమెకు 2 కోట్ల రూపాయలు ఇచ్చే వారట. ఇప్పుడు హిందీ సినిమాలకు 4 కోట్లకు పైగా, తెలుగు సినిమాలకు 3 కోట్లకు పైగా డిమాండ్ చేస్తుందట రష్మిక మందన్న. ఇంత భారీ రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేస్తునప్పటికీ నిర్మాతలు కూడా అమెకున్న క్రేజ్ ను బట్టి ఓకే అనేస్తున్నార‌ట.

పుష్ప 2 : ది రూల్ కోసం ఆమె 4 కోట్ల రూపాయల భారీ మొత్తం తీసుకోనుందట. రష్మిక నటించిన సీతా రామం శుక్ర‌వారం విడుదల కాగా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే రష్మిక ప్రస్తుతం తమిళ తలపతి విజయ్ తో వారసుడులో నటిస్తోంది. దీనికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో యానిమల్ లో నటించనుంది రష్మిక. దీనికి సందీప్ రెడ్డి వంగా డైరెక్టర్.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now