Sreeja Konidela : శ్రీ‌జ‌కు 3వ పెళ్లి.. త‌రువాత ఆస్తి పంప‌కం చేయ‌నున్న చిరంజీవి..?

August 4, 2022 1:58 PM

Sreeja Konidela : మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీ‌జ త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. ఈమె సోష‌ల్ మీడియాలో ఏం పోస్టు పెట్టినా అది వైర‌ల్ అవుతోంది. ఈమె గురించి ఈ మ‌ధ్య కాలంలో అనేక వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇప్ప‌టికే క‌ల్యాణ్ దేవ్‌, ఈమె విడిగా ఉంటున్నార‌ని వార్త‌లు ప్ర‌చారం అవుతున్నాయి. వీరు త్వ‌ర‌లో విడాకులు తీసుకోబోతున్నార‌ని ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. అయితే మెగా ఫ్యామిలీ కానీ.. క‌ల్యాణ్ దేవ్ కానీ దీనిపై క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. ఇక ఈమ‌ధ్యే ప్ర‌ముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి శ్రీ‌జ గురించి చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అయ్యాయి.

ప‌వ‌న్ క‌ల్యాణ్, శ్రీ‌జ జాత‌కాల్లో ఉన్న దోషాల కార‌ణంగా వీరికి పెళ్లిళ్లు స‌రిగ్గా సెట్ కావ‌ని వేణు స్వామి అన్నారు. ఈ క్ర‌మంలోనే వీరు నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటార‌ని అన్నారు. ప‌వ‌న్ ఇప్ప‌టికే 3వ పెళ్లి చేసుకోగా.. శ్రీ‌జది 2వ వివాహం. ఈ క్ర‌మంలోనే శ్రీ‌జ 3వ పెళ్లి చేసుకోబోతుంద‌నే వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అయితే త‌న ముగ్గురు సంతానం విష‌యంలో చిరంజీవి ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నార‌నే వార్త ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

Sreeja Konidela may marry for 3rd time Chiranjeevi may give assets
Sreeja Konidela

చిరంజీవి త‌న చిన్న కుమార్తె శ్రీ‌జ‌కు న‌వంబ‌ర్‌లో వివాహం జ‌రిపించ‌నున్నార‌ట‌. అయితే మూడ‌వ పెళ్లికి చిరంజీవి అంగీక‌రించ‌లేద‌ట‌. కానీ ప‌వ‌న్ ఒప్పించిన‌ట్లు తెలుస్తోంది. ఇక శ్రీ‌జ వివాహం అయ్యాక తన ముగ్గురు సంతానం చ‌ర‌ణ్‌, సుస్మిత‌, శ్రీ‌జ‌ల‌కు త‌న ఆస్తిని మూడు భాగాలుగా పంచి ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ఎవ‌రి జీవితం వాళ్ల‌కు ఉంటుంద‌ని.. ఎవ‌రికి వారు స్వ‌తంత్రంగా జీవిస్తార‌ని చిరంజీవి భావించార‌ట‌. ఈ క్ర‌మంలోనే ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే ఇవ‌న్నీ మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాలే. వీటిల్లో నిజం ఎంత ఉంది.. అన్న విష‌యం తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment