Janhvi Kapoor : ఎన్‌టీఆర్ గురించి జాన్వీ కపూర్‌ కామెంట్స్‌.. జాక్‌పాట్‌ కొట్టేసినట్లే..?

August 3, 2022 8:20 AM

Janhvi Kapoor : తన కెరీర్‌ ప్రారంభంలో జాన్వీ కపూర్‌ ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. శ్రీదేవి కుమార్తె కావడంతో ఈమెపై కొందరు పాజిటివ్‌గానే మాట్లాడుతున్నా.. ఓవరాల్‌గా చూస్తే మాత్రం జాన్వీ కపూర్‌కు విమర్శలే ఎక్కువగా ఎదురవుతున్నాయి. అయితే ఈమధ్య కాలంలో ఈమెపై ఉన్న నెగెటివిటీ కాస్త తగ్గిందనే చెప్పవచ్చు. ఎలాంటి వివాదాల్లోనూ చిక్కుకోకుండా.. తన మానాన తన పని తాను చేసుకుంటోంది. అందుకనే ఆమెపై వస్తున్న విమర్శలు కాస్త తగ్గాయని చెప్పవచ్చు. ఇక జాన్వీ కపూర్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ గుడ్‌ లక్‌ జెర్రీ ఇటీవలే డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో నేరుగా రిలీజ్‌ అయింది. ఈ క్రమంలోనే ఆమె ప్రస్తుతం చిత్ర ప్రమోషనల్‌ కార్యక్రమాల్లో పాల్గొంటోంది.

ఇక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జాన్వీ కపూర్‌.. ఎన్‌టీఆర్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఎన్‌టీఆర్ తో నటించడాన్ని తాను ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలియజేసింది. దీంతో ఎన్‌టీఆర్‌ ఫ్యాన్స్ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. అయితే వాస్తవానికి జాన్వీ కపూర్‌ విజయ్‌ దేవరకొండతో కలిసి లైగర్‌ మూవీలో నటించాల్సి ఉంది. కానీ ఆమెకు డేట్స్‌ అడ్జస్ట్‌ కాలేదు. దీంతో ఆ చాన్స్‌ కోల్పోయింది. అయితే ఎన్‌టీఆర్‌తో సినిమాలో నటించే చాన్స్‌ వచ్చిందని అంటున్నారు. అదే జరిగితే ఈ అమ్మడు జాక్‌ పాట్‌ కొట్టినట్లే అవుతుంది. విజయ్‌ కన్నా ఎన్‌టీఆర్‌ పాపులర్‌. కనుక ఆయనతో సినిమా చేస్తే కచ్చితంగా జాన్వీకి అది బూస్టింగ్‌ అవుతుంది. కెరీర్‌కు ప్లస్‌ పాయింట్‌ అవుతుంది. టాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు దక్కించుకోవచ్చు. మరి ఆమె అలా చేస్తుందా లేదా అనేది చూడాలి.

Janhvi Kapoor said interesting comments about Jr NTR
Janhvi Kapoor

అయితే జాన్వీ కపూర్‌ ఎన్టీఆర్‌పై ఆ కామెంట్స్‌ చేయడంతో త్వరలోనే ఆమె ఆయన మూవీలో నటిస్తుందని అంటున్నారు. గతంలోనూ ఇలాంటి పుకార్లే వచ్చాయి. కానీ వాటిపై క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఇప్పుడు మళ్లీ ఇవే వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఆమె ఎన్‌టీఆర్‌, కొరటాల మూవీలో లేదా.. తరువాత బుచ్చిబాబు, ఎన్‌టీఆర్‌ మూవీలో నటిస్తుందని అంటున్నారు. అయితే దీనిపై స్పష్టత రావల్సి ఉంది. మరి జాన్వీ ఇప్పటికైనా తెలుగు తెరకు ఎంట్రీ ఇస్తుందా.. లేదా.. అనేది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now