Vijay Devarakonda : ర‌ష్మిక మంద‌న్న‌తో ల‌వ్ ట్రాక్‌.. క్లారిటీ ఇచ్చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..

August 2, 2022 8:26 PM

Vijay Devarakonda : రౌడీ హీరోగా పేరుగాంచిన విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. విజ‌య్ ప్ర‌స్తుతం ప‌లు వ‌రుస చిత్రాల‌తో ఎంతో బిజీగా ఉన్నారు. ఈయ‌న త‌దుప‌రి చిత్రం లైగ‌ర్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే అంత‌ర్జాతీయ బాక్సింగ్ దిగ్గ‌జం మైక్ టైస‌న్ ముఖ్య పాత్ర‌లో న‌టించారు. ఇక లైగ‌ర్ మూవీ ఆగ‌స్టు 25న పాన్ ఇండియా లెవ‌ల్‌లో రిలీజ్ కానుంది. దీంతో విజ‌య్ మూవీ కోసం ఆయ‌న ఫ్యాన్స్ మాత్ర‌మే కాకుండా.. ప్రేక్ష‌కులు కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న‌ల‌ది హిట్ పెయిర్‌. వీరు క‌ల‌సి న‌టించిన సినిమాలు హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. అలాగే వీరు ముంబైలో ప‌లు సార్లు పార్టీల‌లో క‌ల‌సి తిరుగుతూ క‌నిపించారు. దీంతో ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఏదో న‌డుస్తుంద‌ని ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్నాయి. వీరు ప్రేమించుకుంటున్న‌ర‌ని.. త్వ‌ర‌లోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నార‌ని.. ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తూనే ఉన్నాయి. అయితే వీటికి విజ‌య్ చెక్ పెట్టాడు. తాజాగా పాల్గొన్న టాక్ షోలో దీనిపై స్పందించాడు.

Vijay Devarakonda given clarity with his friendship with Rashmika Mandanna
Vijay Devarakonda

త‌న‌కు, ర‌ష్మిక మంద‌న్న‌కు మ‌ధ్య ల‌వ్ ట్రాక్ న‌డుస్తుంద‌ని వ‌స్తున్న వార్త‌ల్లో ఎంత‌మాత్రం నిజం లేద‌ని.. విజ‌య్ దేవ‌ర‌కొండ అన్నాడు. అవ‌న్నీ పుకార్లేన‌ని స్ప‌ష్టం చేశాడు. ర‌ష్మిక త‌న‌కు బెస్ట్ ఫ్రెండ్ అని.. ఆమెతో క‌ల‌సి తిరిగితే మా మ‌ధ్య ఏదో ఉంద‌ని.. ఎలా అనుకుంటారు.. అని విజ‌య్ అన్నాడు. ఈ విష‌యాల‌ను ఆయ‌న కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో తెలియ‌జేశాడు. ఇక విజ‌య్ లైగ‌ర్‌తోపాటు మ‌రో రెండు మూవీలు కూడా చేస్తున్నాడు. ఒకటి జ‌న‌గ‌ణ‌మ‌ణ కాగా.. ఇంకొక‌టి ఖుషి. ఇందులో స‌మంత హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లోనే జ‌రుగుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now