Saravanan : ది లెజెండ్ తో రూ.80 కోట్లు లాస్‌.. అయినా శ‌ర‌వ‌ణ‌న్‌కు రూ.100 కోట్లు వ‌చ్చిన‌ట్లే.. ఎలాగంటే..?

July 30, 2022 7:44 PM

Saravanan : చెన్నైలో అతి పెద్ద వస్త్ర వ్యాపార సంస్థ అయిన శరవణన్ స్టోర్స్ అధినేత అరుల్ శరవణన్ హీరోగా మారి.. ది లెజెండ్ అనే సినిమా తీశారు. జేడీ అండ్ జెర్రీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ లో భారీగా శుక్రవారం రిలీజైంది. ఈ సినిమాలో అందాల భామలు ఊర్వశి రౌతెలా, రాయ్ లక్ష్మిలు హీరోయిన్స్ గా నటించారు. సినిమా ఎలా ఉంది అన్నది పక్కన పెడితే సినిమా కమర్షియల్ గా మాత్రం పెద్ద లాస్ వెంచర్ అని చెప్పొచ్చు. తనని హీరోగా ప్రమోట్ చేసుకోవడానికి మాత్రమే శరవణన్ దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్ తో ది లెజెండ్ సినిమాను తెరకెక్కించారు.

అయితే ఈ సినిమా కమర్షియల్ గా లాస్ అయినా మరో విధంగా శరవణన్ కి రూ.100 కోట్ల దాకా లాభం తెచ్చిందని అంటున్నారు. అదెలా అంటే.. ఇక్కడ కూడా శరవణన్ బిజినెస్ మెన్ గా ఆలోచించాడని టాక్. ది లెజెండ్ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేశాడు. సినిమాని భారీగానే ప్రమోట్ చేశారు. ఈ సినిమాలో వాడిన ప్రతి కాస్ట్యూమ్‌ కూడా శరవణన్ స్టోర్స్ నుంచి తెచ్చినవే. మాములుగా ఒక ప్రాంతానికి మాత్రమే ప్రమోట్ చేయడానికి ఒక స్టోర్ కి భారీగా ఖర్చు అవుతుంది. అలా కాకుండా తానో సినిమా తీసి తన వస్త్ర దుకాణం గురించి పాన్ ఇండియా లెవల్ లో ప్రమోట్ చేశాడు శరవణన్.

Saravanan got rs 100 crore profit with the legend movie
Saravanan

అలా చూస్తే శరవణన్ సినిమా ఫ్లాప్ అయినా.. బిజినెస్ మెన్ గా ఆయనకు ఈ ప్రమోషన్స్ కి రూ.100 కోట్లు పెట్టినా తక్కువే అవుతుంది. సో అలా ఇప్పుడు శరవణన్ స్టోర్స్ అందరికి రీచ్ అయినందుకు రూ.100 కోట్ల దాకా ఖర్చు పెట్టకుండానే సినిమా ద్వారా ప్రజలకు చేరువయ్యారు. అక్కడే బిజినెస్ మెన్ గా శరవణన్ లాభ పడ్డారని చెప్పొచ్చు. తన క్లాత్ స్టోర్ యాడ్ లో కూడా తనే నటించే శరవణన్ యాడ్ వరకు ఓకే కానీ సినిమా అంటే ఎంత రిస్క్ ఉంటుందో ఇప్పుడు అర్ధమయ్యి ఉండొచ్చు. కానీ.. సినిమా లాస్ అన్న‌ది ప‌క్క‌న పెడితే.. అదే బ‌డ్జెట్‌తో ఆయ‌న స్టోర్స్‌కు బాగా ప్ర‌చారం జ‌రిగింద‌ని చెప్పొచ్చు. ఇది ప‌బ్లిసిటీ కింద‌కే వ‌స్తుంది. దీంతో ఆయ‌న బిజినెస్ డెవ‌ల‌ప్ అవుతుంది. సో.. ఈ మూవీ ద్వారా ఆయ‌న న‌ష్టాల‌ను పొందుతారు.. అనుకునే వాళ్లంతా ఇప్పుడు ఈ విష‌యం తెలిసి ముక్కున వేలేసుకుంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now