హిందూ ధర్మం ప్రకారం పొరపాటున కూడా ఈ వస్తువులను కింద పెట్టకూడదు తెలుసా?

June 5, 2021 8:53 PM

మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం కొన్ని వస్తువులను ఎంతో పవిత్రంగా భావిస్తున్నాము. అలాంటి వస్తువులను ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదు అనే నియమాలను కూడా పాటిస్తుంటారు. ఈ క్రమంలోనే పూజకు సంబంధించిన వస్తువులను పూజా సామాగ్రిని నేలపై పెట్టకూడదని చెబుతుంటారు. ఇవే కాకుండా మరికొన్ని వస్తువులను కూడా ఎలాంటి పరిస్థితులలో కూడా నేలపై పెట్టకూడదు. మరి అలాంటి వస్తువులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

హిందువులలో చాలామంది జంధ్యం ధరించి ఉంటారు. ఈ జంధ్యాన్ని తల్లిదండ్రులకు గురువుకు ప్రతీకగా భావిస్తారు. ఎంతో పవిత్రమైన ఈ జంధ్యాన్ని ఎలాంటి పరిస్థితులలో కూడా కింద పెట్టకూడదు. ఒకవేళ అలా జంధ్యాన్ని నేలపై పెట్టడం వల్ల గురువును తల్లిదండ్రులను అవమానించినట్లని భావిస్తారు. మహావిష్ణువుకు ఎంతో ప్రత్యేకమైన సాలి గ్రామాలను కూడా కింద పెట్టకూడదు.

ప్రతిరోజు ఉదయం సాయంత్రం మనం దేవుడు ముందు దీపాలను వెలిగిస్తారు. ఈ దీపాలను నేలపై పెట్టకూడదు. ఎటువంటి ఆధారం లేకుండా దేవుడికి దీపం వెలిగిస్తే మన జీవితానికి కూడా ఎటువంటి ఆధారం ఉండదని చెబుతారు. అందుకోసమే ఏదైనా ధాన్యం లేదా ఆకుపై దీపాన్ని వెలిగించాలి. శంకువును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కనుక శంకువుని ఎలాంటి పరిస్థితులలో కూడా కింద పెట్టకూడదు. శంఖాన్ని ఏదైనా పసుపుపచ్చని లేదా ఎరుపు రంగు వస్త్రంలో కానీ, ధాన్యం పై గాని పెట్టి పూజించాలి.ఈ విధంగా హిందువులు ఎంతో పవిత్రంగా భావించే వస్తువులను ఎలాంటి పరిస్థితులలో కూడా నేలపై పెట్టకూడదని పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment