పాపం చిన్నారి.. ఆదుకోరూ..!

June 4, 2021 6:09 PM
  • ఎస్ఎమ్ఏ టైప్ 3 వ్యాధితో బాధపడుతున్న
    4 ఏళ్ల‌ చిన్నారి సానవి
  • ఇంజక్షన్ ఖరీదు రూ.16 కోట్లు
  • దాత‌లు ముందుకు వ‌చ్చి
    త‌మ కుమార్తెను రక్షించాల‌ని త‌ల్లిదండ్రుల విన‌తి
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త‌మ పాప‌ను కాపాడాల‌ని
    వేడుకుంటున్న సానవి త‌ల్లిదండ్రులు

అభం శుభం తెలియ‌ని చిన్నారి.. అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతోంది.. ఓ వైపు త‌ల్లిదండ్రులు పేద కుటుంబానికి చెందిన వారు.. మ‌రోవైపు ఆదుకునే వారు లేరు.. దీంతో త‌మ చిన్నారి వైద్య చికిత్స‌కు స‌హాయం చేసే వారి కోసం ఆ త‌ల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. చికిత్స‌కు ఎంతో ఖ‌ర్చు అవుతుంద‌ని వైద్యులు చెప్ప‌డంతో వారు ప్ర‌స్తుతం దిక్కు తోచ‌ని స్థితిలో ఆప‌న్న హ‌స్తం అందించే మ‌నస్సు ఉన్న దాత‌ల కోసం ఎదురు చూస్తున్నారు.

this poor couple requests donors to help treat their daughter

అంబ‌ర్‌పేట నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని కాచిగూడ డివిజ‌న్‌కు చెందిన దోషిలి విన‌య్ కుమార్‌, దోషిలి శిల్పలు దంప‌తులు. వారిది పేద కుటుంబం. వారికి 4 ఏళ్ల కుమార్తె ఉంది. పేరు సాన‌వి. ఆమెకు పుట్టుక‌తోనే తీవ్ర అనారోగ్య స‌మ‌స్య వ‌చ్చింది. వెన్నెముక స‌మ‌స్య రావ‌డంతో ఆమెకు హాస్పిట‌ల్‌లో ప‌రీక్ష‌లు చేయించారు. దీంతో ఆమెకు ఎస్ఎమ్ఏ టైప్ 3 వ్యాధి ఉన్న‌ట్లు నిర్దార‌ణ అయింది. ఇది అత్యంత అరుదైన వ్యాధి కాగా చికిత్స‌కు భారీగా ఖ‌ర్చ‌వుతుంద‌ని వైద్యులు తెలిపారు.

ఈ వ్యాధి బారిన ప‌డిన వారికి Zolgensma Spinraza అనే ఇంజెక్ష‌న్ చేయాల్సి ఉంటుంది. దాని ఖ‌రీదు దాదాపుగా రూ.16 కోట్లు ఉంటుంద‌ని వైద్యులు తెలిపారు. ఈ విష‌యం తెలుసుకున్న సాన‌వి త‌ల్లిదండ్రులు హ‌తాశుల‌య్యారు. అంత డ‌బ్బు వెచ్చించే స్థోమ‌త వారికి లేక‌పోవ‌డంతో వారు తీవ్రంగా బాధ‌ప‌డుతున్నారు. త‌మ గోడును ఎవ‌రికి చెప్పుకోవాలో తెలియక క‌న్నీటి ప‌ర్యంత‌మ‌వుతున్నారు.

కాగా త‌మ చిన్నారిని ఆదుకోవాల‌ని ఆమె త‌ల్లిదండ్రులు అంద‌రినీ వేడుకుంటున్నారు. మ‌న‌స్సున్న మారాజులు స్పందించి త‌మ పాప‌ను బ‌తికించాల‌ని కాళ్లా వేళ్లా ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో వారు త‌మ పాప‌ను బ‌తికించాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వానికి సైతం విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. అలాగే దాతలు ముందుకు వ‌చ్చి త‌మ కుమార్తె ప్రాణాల‌ను కాపాడాల‌ని వేడుకుంటున్నారు.

బాధితుల వివ‌రాలు

Father name: Doshili Vinay Kumar
Mother’s name: Doshili Shilpa
Baby Name: Doshili Saanvi

Account Number: 50100421831334
IFSC CODE: HDFC0000240
PHONE Pay: 9618779839
Google Pay: 9618779839
Paytm: 9618779839

Injection name: Zolgensma Spinraza

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment