గాడ్జిల్లా వ‌ర్సెస్ కాంగ్ మూవీ.. బాక్సాఫీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్లు..

March 30, 2021 9:21 PM

అమెరిక‌న్ మాన్‌స్ట‌ర్ ఫిలిం గాడ్జిల్లా వ‌ర్సెస్ కాంగ్ మార్చి 25వ తేదీన విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. గాడ్జిల్లా, కాంగ్ సిరీస్‌లో వ‌చ్చిన నాలుగో మూవీ ఇది. గాడ్జిల్లా, కాంగ్ – స్క‌ల్ ఐల్యాండ్‌, గాడ్జిల్లా – కింగ్ ఆఫ్ మాన్‌స్ట‌ర్స్ త‌రువాత వ‌చ్చిన మూవీ ఇది. ఈ క్ర‌మంలోనే ఈ మూవీ మ‌న దేశంలో బాక్సాఫీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్ల‌నే రాబ‌డుతోంది. వీకెండ్ స‌మ‌యంలో ఈ మూవీకి ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న ల‌భించింది. కోవిడ్ భ‌యం ఉన్న‌ప్ప‌టికీ ప్రేక్ష‌కులు ఈ మూవీని చూసేందుకు థియేట‌ర్ల‌కు వెళ్తుండ‌డం విశేషం.

godzilla vs kong good box office collections in india

గాడ్జిల్లా వ‌ర్సెస్ కాంగ్ మూవీ తొలి 5 రోజుల్లో రూ.28.96 కోట్ల బాక్సాఫీస్ క‌లెక్ష‌న్ల‌ను సాధించింది. వారాంతాల్లోనే దాదాపుగా రూ.13 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్లు రావ‌డం విశేషం. అయితే ప‌లు ప్రాంతాల్లో కోవిడ్ రూల్స్ లేక‌పోతే ఇంకా ఎక్కువ క‌లెక్ష‌న్లు వ‌చ్చి ఉండేవి అని మార్కెట్ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. మొత్తం మీద గాడ్జిల్లా వ‌ర్సెస్ కాంగ్ మూవీ భార‌తీయ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే ఉత్త‌ర భారతం కంటే ద‌క్షిణ భార‌తంలోనే ఈ మూవీని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని తెలిసింది.

గాడ్జిల్లా మూవీ త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ల‌లో ఎక్కువ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. కేర‌ళ‌లోనూ ఒక మోస్త‌రుగా ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. అయితే హిందీలో ఈ మూవీకి పెద్ద‌గా ఆద‌ర‌ణ ల‌భించ‌డం లేదు. క‌రోనా ప్ర‌భావం వ‌ల్లే ఈ ప‌రిస్థితి ఏర్ప‌డిందని తెలుస్తోంది. అయిన‌ప్ప‌టికీ ఓవ‌రాల్‌గా చూస్తే ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచింద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment