సైబ‌ర్ మోసం ద్వారా డ‌బ్బు కోల్పోయారా ? 10 రోజుల్లో రీఫండ్ వ‌స్తుంది..!

June 5, 2021 10:49 AM

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పెద్ద నోట్లను ర‌ద్దు చేయ‌డం ఏమోగానీ అప్ప‌టి నుంచి దేశంలో డిజిట‌ల్ లావాదేవీల సంఖ్య పెరిగింది. బ‌య‌ట మ‌నం చిన్న వ‌స్తువు కొన్నా వ్యాపారుల వ‌ద్ద డిజిట‌ల్ చెల్లింపులు చేసేందుకు మాధ్య‌మాలు అందుబాటులో ఉంటున్నాయి. దీంతో స‌హ‌జంగానే ప్ర‌జ‌లు డిజిట‌ల్ చెల్లింపులు చేసేందుకు అల‌వాటు ప‌డ్డారు. అయితే డిజిట‌ల్ చెల్లింపులు పెరుగుతుండ‌డం బాగానే ఉన్న‌ప్ప‌టికీ మ‌రోవైపు సైబ‌ర్ మోసాలు కూడా పెరుగుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

lost money in cyber fraud money will be refunded in 10 days

దేశంలో రోజూ అనేక సైబ‌ర్ మోసాలు జ‌రుగుతున్నాయి. ప్ర‌జ‌ల‌ను మాయ చేసి కొంద‌రు డ‌బ్బుల‌ను దోచేస్తున్నారు. అయితే సైబ‌ర్ మోసం బారిన ప‌డి డ‌బ్బును న‌ష్ట‌పోతే దిగులు చెందాల్సిన ప‌నిలేదు. వెంట‌నే బ్యాంకుకు ఫిర్యాదు చేస్తే డ‌బ్బులు వెన‌క్కి వ‌స్తాయి. ఆర్‌బీఐ ఇందుకు ప్ర‌త్యేక నియ‌మావ‌ళిని సూచించింది.

సైబ‌ర్ మోసం జ‌రిగిన‌ప్పుడు ప్ర‌జ‌లు త‌మ అకౌంట్లు ఉన్న బ్యాంకుల‌కు సంఘ‌ట‌న జ‌రిగిన 3 రోజుల్లోగా ఫిర్యాదు చేయాలి. దీంతో 10 రోజుల్లోగా పోయిన డ‌బ్బు తిరిగి వ‌స్తుంది. ఇక సంఘ‌ట‌న జ‌రిగిన త‌రువాత 4-7 రోజుల మ‌ధ్యలో ఫిర్యాదు చేస్తే ప్ర‌జ‌లు రూ.25వేల వ‌ర‌కు న‌ష్ట‌పోవాల్సి ఉంటుంది. మోస‌పోయిన మొత్తాన్ని బ‌ట్టి న‌ష్ట‌పోయే మొత్తం మారుతుంది. అయితే ప్ర‌జలు త‌మ ప్రమేయం లేకుండా డ‌బ్బు పోతే దాన్ని నిర్ణీత స‌మ‌యంలోగా ఫిర్యాదు చేసి వెన‌క్కి పొంద‌వ‌చ్చు. కానీ వారి నిర్లక్ష్యం కార‌ణంగా డ‌బ్బు పోతే బ్యాంకులు అందుకు బాధ్య‌త వ‌హించ‌వు.

ఇత‌రుల‌కు మీ బ్యాంక్ లేదా కార్డుల స‌మాచారం చెప్పినా, పిన్ లేదా పాస్‌వ‌ర్డ్‌ల‌ను షేర్ చేసినా, ఇత‌రుల‌తో కార్డు ఉప‌యోగించినా, క్యూఆర్ కోడ్‌ల‌ను స్కాన్ చేసి డ‌బ్బును న‌ష్ట‌పోయినా.. అందుకు ఖాతాదారుల‌దే బాధ్య‌త ఉంటుంది. క‌నుక ఇలాంటి సంద‌ర్భాల్లో బ్యాంకులు ఏమీ చేయ‌లేవు. ఖాతాదారుల ప్ర‌మేయం అస‌లు లేకున్నా డబ్బు పోతేనే బ్యాంకులు బాధ్యత వ‌హిస్తాయి. అలాంటి సంద‌ర్భాల్లోనే డ‌బ్బును బ్యాంకులు రీఫండ్ చేస్తాయి. మిగిలిన సంద‌ర్బాల్లో డ‌బ్బులు పోతే పోలీసుల‌ను ఆశ్ర‌యించాల్సి ఉంటుంది. వారు మోస‌గాళ్ల‌ను ట్రేస్ చేసి గుర్తించి డ‌బ్బును రిక‌వ‌రీ చేస్తారు. అదీ మోస‌గాళ్ల దొరికితేనే, వారి ద‌గ్గ‌ర డ‌బ్బు ఉంటేనే రిక‌వ‌రీకి సాధ్య‌మ‌వుతుంది. లేదా పోయిన డ‌బ్బులు వెన‌క్కి రావు. కనుక అత్యంత విలువైన మీ బ్యాంకింగ్ స‌మాచారాన్ని ఇత‌రుల‌కు అస్స‌లు చెప్ప‌కండి. బ్యాంకింగ్ మోసాల నుంచి జాగ్ర‌త్త‌గా ఉండండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment