Pooja Hegde : వార్నీ.. పూజా హెగ్డె ఏం ఊపింది.. అద‌ర‌గొట్టిందిగా.. వీడియో..!

July 14, 2022 8:59 PM

Pooja Hegde : తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు పూజా హెగ్డె గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె త‌న అందం, న‌ట‌న‌తో ఎంతో మంది అభిమానం చూర‌గొంది. అలాగే డ్యాన్స్ చేయ‌డంలోనూ పూజా హెగ్డె పెట్టింది పేరు. క‌నుక‌నే ఆమెకు ఇత‌ర భాష‌ల‌కు చెందిన చిత్రాల్లోనూ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఇక ఫిట్ నెస్ విష‌యంలోనూ ఈమె ఎంతో జాగ్ర‌త్త వ‌హిస్తుంది. ఈమె అందం గురించి ఎంత చెప్పినా అదిఆ త‌క్కువే అవుతుంది. ఈమెను అంద‌రూ పొడుగు కాళ్ల సుంద‌రి అని పిలుస్తుంటారు. అలాగే అభిమానులు బుట్ట‌బొమ్మ అని పిలుస్తారు. ఈ క్ర‌మంలోనే ఆమె అందం, డ్యాన్స్‌కు అందరూ ఫిదా అవుతుంటారు.

పూజా హెగ్డె త‌మిళ సినిమా ద్వారా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయింది. ఈమె తెలుగులో 2014లో వ‌చ్చిన ఒక లైలా కోసం అనే మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయింది. అందులో నాగ‌చైత‌న్య హీరోగా న‌టించారు. త‌రువాత ఆమెకు అనేక సినిమాల్లో ఆఫ‌ర్లు వ‌చ్చాయి. స్టార్ న‌టుల‌తో ఈమె యాక్ట్ చేసింది. అల్లు అర్జున్‌తో క‌లిసి డీజే, అల వైకుంఠ పుర‌ములో చేయ‌గా, మ‌హేష్ తో క‌ల‌సి మ‌హ‌ర్షి చేసింది. అలాగే ప్ర‌భాస్ తో రాధే శ్యామ్ చేసింది. రామ్ చ‌ర‌ణ్‌తో ఆచార్య‌లోనూ త‌ళుక్కుమంది. ఈ క్ర‌మంలోనే పూజా హెగ్డె సోష‌ల్ మీడియాలోనూ త‌న డ్యాన్స్ వీడియోల‌తో అద‌రగొడుతోంది. ఇక తాజాగా ఆమె చేసిన డ్యాన్స్ తాలూకు వీడియో వైర‌ల్‌గా మారింది.

Pooja Hegde dance video viral on social media
Pooja Hegde

పూజా హెగ్డె తాజాగా ఓ అవార్డ్స్ ఫంక్ష‌న్‌లో పాల్గొన‌గా.. ఆమె డ్యాన్స్ చూసిన ప్రేక్ష‌కులు షాక‌వుతున్నారు. ఆమె రాములో రాముల‌, బుట్ట‌బొమ్మ‌, సీటీమార్ త‌దిత‌ర పాట‌ల‌కు డ్యాన్స్ చేసి అల‌రించింది. ఈమె సినిమాలో కూడా ఈ విధంగా చేయ‌లేద‌ని అంటున్నారు. ఒక సంద‌ర్భంలో అయితే ఈమె ఏకంగా 10 నిమిషాల పాటు డ్యాన్స్ చేసి అల‌రించింది. కాగా ఈమె డ్యాన్స్ చేసిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. దీన్ని నెటిజ‌న్లు చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment