Sai Pallavi : సాయిప‌ల్ల‌వీ.. మ‌ళ్లీ ఎందుకు అందులోకే వెళ్తున్నావు.. అయిపోయింది, విడిచిపెట్టు..!

July 13, 2022 12:55 PM

Sai Pallavi : సాధార‌ణంగా సినిమా సెల‌బ్రిటీలు వివాదాల‌కు కాస్త దూరంగానే ఉండేందుకు య‌త్నిస్తుంటారు. కానీ కొన్ని సంద‌ర్భాల్లో మాత్రం అనుకోకుండా వివాదాల్లో చిక్కుకుంటారు. వారు చేసే ప‌నులు, పెట్టే కామెంట్లు, మాట్లాడే మాట‌లు కొన్ని సంద‌ర్భాల్లో కొంద‌రికి న‌చ్చ‌వు. దీంతో వివాదాస్ప‌దం అవుతుంటారు. సినిమాలు చేశామా.. హిట్ కొట్టామా.. వెకేష‌న్‌కు వెళ్లామా.. మ‌ళ్లీ సినిమా మొద‌లెట్టామా.. అన్న‌ట్లుగానే చాలా మంది సెల‌బ్రిటీలు ఉంటారు. ఎవ‌రూ అంత సుల‌భంగా వివాదాల్లో కావాల‌ని చిక్కుకోరు. కానీ సాయిప‌ల్ల‌వి పంథా చూస్తుంటే మాత్రం కావాల‌నే మ‌ళ్లీ వివాదంలో ఇరుక్కోవాల‌ని చూస్తున్న‌ట్లు అనిపిస్తోంది.

సాయిప‌ల్ల‌వి స‌హ‌జంగానే ఏ వివాదం వైపుకు వెళ్ల‌దు. కానీ ఇటీవ‌లే ఆమె విరాట ప‌ర్వం సినిమా రిలీజ్‌కు ముందు అన‌వ‌స‌రంగా ఓ వ‌ర్గం వారిని బాధ‌పెట్టేలా వ్యాఖ్య‌లు చేసింది. అక్క‌డ ఆమె కావాల‌నే ఆ వ్యాఖ్య‌లు చేసిందా.. లేక ఆ వ్యాఖ్య‌లు నిజంగానే వాళ్ల‌ను బాధ‌పెట్టాయా.. ఆమె ఉద్దేశ‌పూర్వ‌కంగానే అలా మాట్లాడిందా.. అన్న‌ది ప‌క్క‌న పెడితే.. ఏదో తెలిసో తెలియ‌కో అలా మాట్లాడింది అనుకుంటే.. ఆ గొడ‌వ అక్క‌డితో అయిపోయింది. ఆమె సారీ కూడా చెప్పేసింది.

why Sai Pallavi again and again talking about old comments
Sai Pallavi

అయితే మ‌ళ్లీ అదే గొడ‌వ గురించి కామెంట్లు చేస్తుంటే ఏమ‌నాలి ? మ‌ళ్లీ అయిపోయిన దాన్ని తిరిగి తోడ‌డం ఎందుకు ? ఒక‌సారి కామెంట్స్ చేశాకే గొడ‌వ‌లో ఇరుక్కుంది. అలాంటి దాంట్లోకి మ‌ళ్లీ వెళ్ల‌డం ఎందుకు ? తెలిసి తెలిసీ వివాదంలో మ‌ళ్లీ చిక్కుకుపోవ‌డం ఎందుకు ? చూస్తుంటే ఇదంతా ఆమె కావాల‌నే చేస్తుందా.. అని ఎవ‌రికైనా అనిపిస్తుంది. ఇప్ప‌టికైనా ఎలాంటి వివాదాల్లోనూ త‌ల‌దూర్చ‌కుండా ఉంటే మంచిది. అస‌లే ఆఫ‌ర్లు లేక ఆమె కెరీర్ డౌన్ ఫాల్‌లో ఉంది. ఇలాంటి స‌మ‌యాల్లో వివాదాల్లో ఇరుక్కోవ‌డం అవ‌స‌ర‌మా.. అని కామెంట్స్ చేస్తున్నారు. మ‌రి సాయిప‌ల్ల‌వి ఇప్ప‌టికైనా త‌న పంథాను మార్చుకుంటుందా.. లేదా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now