Bithiri Sathi : ఒక ఎపిసోడ్‌కు బిత్తిరి స‌త్తి తీసుకుంటున్న రెమ్యున‌రేష‌న్ అంత‌నా..?

జూలై 12, 2022 2:47 సా.

Bithiri Sathi : బిత్తిరి స‌త్తిగా పేరుగాంచిన చేవెళ్ల ర‌వి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న మొద‌ట్లో వీ6 న్యూస్ చాన‌ల్‌లో తీన్మార్ వార్త‌ల్లో క‌నిపించారు. త‌రువాత టీవీ9 ఆ త‌రువాత సాక్షి చాన‌ల్స్‌లో ప‌నిచేశారు. అయితే అక్క‌డి నుంచి కూడా బ‌య‌ట‌కు వ‌చ్చి ఇప్పుడు సొంతంగా యూట్యూబ్ చాన‌ల్‌ను నిర్వ‌హిస్తూ పాపుల‌ర్ అయ్యారు. అలాగే కొత్త సినిమాల‌కు చెందిన న‌టీన‌టుల‌ను ఇంట‌ర్వ్యూల‌ను చేస్తున్నారు. ప‌లు కార్య‌క్ర‌మాల్లోనూ ఈయ‌న సంద‌డి చేస్తున్నారు. అయితే అప్ప‌టికన్నా ఇప్పుడు బిత్తిరి సత్తి ఎక్కువ ఆదాయం పొందుతున్నార‌ని చెప్ప‌వ‌చ్చు.

బిత్తిరి స‌త్తితో చాలా మంది న‌టీనటులు ఇంట‌ర్వ్యూలు చేస్తూ త‌మ సినిమాల‌ను ప్ర‌మోట్ చేసుకుంటున్నారు. గ‌తంలో ఆర్ఆర్ఆర్ ఆ త‌రువాత అంటే సుంద‌రానికి.. ఇలా ప‌లు ఈ మ‌ధ్య‌కాలంలో రిలీజ్ అయిన ప‌లు సినిమాల‌కు చెందిన న‌టీన‌టుల‌ను ఈయ‌న ఇంట‌ర్వ్యూ చేశారు. ఇక ఒక్క ఇంట‌ర్వ్యూకు గాను ఈయ‌న‌కు రూ.3 ల‌క్ష‌ల వ‌ర‌కు ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది. టీవీల్లో ఏదైనా ఒక షోలో ఒక ఎపిసోడ్‌లో క‌నిపించినా కూడా ఈయ‌న ఇంతే మొత్తాన్ని తీసుకుంటున్నార‌ట‌.

Bithiri Sathi taking huge amount of remuneration for one episode
Bithiri Sathi

ఇక బిత్తిరి స‌త్తికి యాడ్స్ లో న‌టించాల్సిందిగా ఆఫ‌ర్లు కూడా వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఒక్క యాడ్ చేసేందుకు రూ.6 ల‌క్ష‌ల వ‌ర‌కు డిమాండ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈయ‌న న‌టించిన ప‌లు యాడ్స్ కూడా టీవీల్లో, సామాజిక మాధ్య‌మాల్లో క‌నిపిస్తున్నాయి. ఏది ఏమైనా.. న్యూస్ చాన‌ల్స్‌లో ఉన్న‌ప్ప‌టి క‌న్నా వాటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాకే స‌త్తి ఎక్కువ‌గా సంపాదిస్తున్నార‌ని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment