Naga Chaitanya : ఆమెతో అన్ని విష‌యాల‌ను షేర్ చేసుకుంటా.. నాగ‌చైత‌న్య కామెంట్స్ వైర‌ల్‌..!

July 11, 2022 3:56 PM

Naga Chaitanya : అక్కినేని నాగ‌చైత‌న్య త‌న సినిమా కెరీర్ తొలినాళ్ల‌లో స‌క్సెస్ కోసం తీవ్రంగా శ్ర‌మించాడు. కానీ త‌రువాత తానేంటో నిరూపించుకున్నాడు. తొలి సినిమా జోష్ ఫ్లాప్ అయినా.. ఏం మాయ చేశావెతో హిట్ కొట్టాడు. ఆ త‌రువాత చైతూ వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. స్వ‌త‌హాగా చైతూను అంద‌రూ సౌమ్యుడ‌ని పిలుస్తుంటారు. అలాంటి వ్య‌క్తికి స‌మంత విడాకులు ఇచ్చిందంటే.. ఆయ‌న ఆమె వ‌ల్ల ఎంత‌టి బాధ‌ను అనుభ‌వించాడో అర్థం చేసుకోవ‌చ్చు.. అంటూ అక్కినేని అభిమానులు సమంత‌ను తెగ ట్రోల్ చేశారు. అయితే అది గ‌తం. ఇప్పుడు చైతూ త‌న ప‌నేంటో తాను చేసుకుంటున్నాడు.

ఇక నాగ‌చైత‌న్య‌, రాశి ఖ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన థాంక్ యూ మూవీ ఈనెల 22వ తేదీన రిలీజ్ కానుంది. ఈ క్ర‌మంలోనే వీరు ఈ చిత్రానికి సంబంధించి ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇక తాజాగా వీరు ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొని ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు. చైతూకు సైట్ ఉంద‌ని, అందుక‌నే ఆయన సినిమాల్లో కూడా అప్పుడ‌ప్పుడూ క‌ళ్ల‌ద్దాల‌ను ధ‌రిస్తుంటాడ‌ని.. కానీ దీన్ని చూసి ఆయ‌న స్టైల్ కోసం క‌ళ్ల‌ద్దాల‌ను ధ‌రిస్తుంటాడ‌ని అనుకుంటార‌ని.. ఇందులో నిజం లేద‌ని తెలిపింది.

Naga Chaitanya comments on Rasi Khanna viral
Naga Chaitanya

ఇక చైత‌న్య కూడా ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించాడు. తాను, రాశిఖ‌న్నా మంచి ఫ్రెండ్స్ అని.. కానీ త‌మ గురించి బ‌య‌ట అనేక పుకార్లు వ‌స్తున్నాయ‌ని చైతూ తెలిపాడు. తాను ఏ విష‌యాన్ని అయినా స‌రే ఆమెతో పంచుకుంటాన‌ని తెలిపాడు. కాగా రాశిఖ‌న్నాపై చైతూ చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి. ఇక థాంక్ యూ మూవీకి విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. ఈ మూవీతో చైతూ హ్యాట్రిక్ సాధిస్తాడ‌ని అక్కినేని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment