Priya Anand : నిత్యానందుడు అంత‌గా న‌చ్చాడా త‌ల్లీ.. పెళ్లి చేసుకుంటుంద‌ట‌..!

July 9, 2022 4:41 PM

Priya Anand : భార‌తీయుల‌కు.. అందులోనూ ద‌క్షిణాది వారికి నిత్యానంద స్వామి గురించి బాగా తెలుసు. ఈయ‌న అప్ప‌ట్లో త‌న ప్ర‌వ‌చ‌నాల‌తో ఎంతో మంది భ‌క్తుల‌ను సొంతం చేసుకున్నారు. అయితే ఈయ‌న లీల‌లు ఎక్కువైపోయాయి. అప్ప‌ట్లో ఈయ‌న పాల్ప‌డిన అకృత్యాల‌కు గాను ఈయ‌న‌పై ఫిర్యాదులు ఎక్కువై కేసులు కూడా న‌మోద‌య్యాయి. దీంతో ఈయ‌న‌కు నాన్ బెయిల‌బుల్ వారెంట్ కూడా జారీ అయింది. అయితే ఇక అరెస్టు చేయ‌డ‌మే త‌రువాయి అనుకుంటున్న స‌మ‌యంలో దేశం విడిచి పారిపోయాడు. త‌రువాత ఎక్క‌డో దీవి కొనుక్కుని దానికి త‌న‌ను తాను రాజుగా ప్ర‌క‌టించుకున్నాడు. దానికి సొంత భాష‌, క‌రెన్సీ త‌దిత‌ర అన్నింటినీ ఏర్పాటు చేసుకున్నాడు. అయితే నిత్యానందుడు ప్ర‌స్తుతం మ‌న దేశంలో లేక‌పోయినా త‌ర‌చూ వార్తల్లో అయితే నిలుస్తున్నాడు.

తాజాగా ఈయ‌న మ‌రోసారి వార్త‌ల్లో నిలిచాడు. అయితే అది ఈయ‌న వ‌ల్ల కాదు.. ఒక హీరోయిన్ వ‌ల్ల‌. అవును.. మీకు ప్రియా ఆనంద్ తెలుసు క‌దా. అప్ప‌ట్లో ఈమె రానా న‌టించిన లీడ‌ర్ అనే సినిమా ద్వారా సినీ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయింది. త‌రువాత రామ రామ కృష్ణ కృష్ణ‌, 180, కో అంటే కోటి వంటి చిత్రాల్లో న‌టించింది. కానీ అవేవీ హిట్ కాలేదు. దీంతో ఈమె సినిమాల‌కు దూరంగానే ఉంటోంది. ప్ర‌స్తుతం ఈమెకు ఆఫ‌ర్లు కూడా పెద్ద‌గా లేవు.

Priya Anand said she would like to marry Nityananda
Priya Anand

అయితే ప్రియా ఆనంద్ ఇటీవ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. త‌న‌ను తాను దేవుడిగా ప్ర‌క‌టించుకున్న నిత్యానందుడిని పెళ్లి చేసుకుంటాన‌ని స్ప‌ష్టం చేసింది. ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ నిత్యానంద అంటే త‌న‌కు బాగా ఇష్ట‌మ‌ని చెప్పింది. అంతేకాదు.. ఆయ‌న‌ను పెళ్లి చేసుకుంటాన‌ని కూడా తెలియ‌జేసింది. దీంతో ఉన్న‌ట్లుండి ఈమె చేసిన కామెంట్స్‌కు అంద‌రూ షాక‌వుతున్నారు. అలాంటి వ్య‌క్తిని పెళ్లి చేసుకుంటాన‌ని ఈమె ఇంత ఓపెన్‌గా చెప్పిందేమిటా.. అని అంద‌రూ షాక్‌కు గుర‌వుతున్నారు. ఆమె అలా ఎందుకు మాట్లాడింద‌ని చ‌ర్చించుకుంటున్నారు. అవున్లే.. ఎవ‌రికి ఎవ‌రు న‌చ్చుతారో ఎవ‌రికీ తెలియ‌దు క‌దా.. ఎవ‌రిష్టం వారిది.. ఎవ‌రినీ ఏమీ అంటానికి లేదు..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now