Sri Reddy : అర్థ‌రాత్రి రోడ్ల‌పై బైక్‌ల‌ను ఆపిన శ్రీ‌రెడ్డి.. వీడియో వైర‌ల్‌..!

July 9, 2022 9:16 AM

Sri Reddy : న‌టి శ్రీ‌రెడ్డి ఈ మ‌ధ్యకాలంలో సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. త‌న యూట్యూబ్ చాన‌ల్‌లో ప‌లు వంట‌కాల‌కు చెందిన వీడియోల‌ను పోస్ట్ చేస్తూ అల‌రిస్తోంది. ఇప్ప‌టికే ఎన్నో ర‌కాల వంట‌కాల‌ను శ్రీ‌రెడ్డి చేసి చూపించింది. చికెన్‌, మ‌ట‌న్‌, రొయ్య‌లు, చేప‌లు.. ఇలా అనేక వంట‌ల‌ను వండింది. దీంతోపాటు రెస్టారెంట్ల‌లోనూ సంద‌డి చేసింది. ప‌లు రెస్టారెంట్ల‌కు వెళ్లి ఫుడ్‌ను తిని వాటికి రివ్యూలు ఇచ్చింది. అయితే తాజాగా శ్రీ‌రెడ్డికి చెందిన ఓ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. ఆమె అర్థ‌రాత్రి పూట బైక్‌ల‌ను ఆపుతూ హ‌ల్ చ‌ల్ చేసింది. అయితే ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

శ్రీ‌రెడ్డికి తెలుగులో అవ‌కాశాలు లేవు కానీ చెన్నైకి మ‌కాం మార్చాక అక్క‌డ బాగానే అవ‌కాశాలు వ‌స్తున్నాయి. అక్క‌డి టీవీ చాన‌ల్స్‌కు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ పాపుల‌ర్ అవుతోంది. అలాగే అక్క‌డి యూట్యూబ్ చాన‌ల్స్‌తోనూ సంద‌డి చేస్తోంది. అందులో భాగంగానే ఈమె ఓ యూట్యూబ్ చాన‌ల్‌తో క‌లిసి అర్థ‌రాత్రి చెన్నై రోడ్ల‌పై ప్రాంక్ వీడియోలు చేసింది. ఆ చాన‌ల్ వారు ఆమెకు చాలెంజ్ విసిరారు. మీరు ఎప్పుడైనా ఎవ‌రి ఫోన్ నంబ‌ర్ అయినా అడిగి తీసుకున్నారా.. అని వారు అడగ్గా.. లేదు.. అని శ్రీ‌రెడ్డి స‌మాధానం ఇచ్చింది. అయితే ఇప్పుడు రోడ్డుపై బైక్‌ను ఆపి ఫోన్ నంబ‌ర్‌ల‌ను అడిగి తీసుకోండి.. ఎంత‌మంది ఇస్తారో చూద్దాం.. అని అడ‌గ్గా.. అందుకు ఆమె స‌రే అని చెప్పి వెంట‌నే రంగంలోకి దిగింది.

Sri Reddy given interview to Tamil channel video viral
Sri Reddy

అలా శ్రీ‌రెడ్డి అర్థ‌రాత్రి చెన్నై రోడ్ల‌పై హ‌ల్‌చ‌ల్ చేసింది. బైక్స్‌ను ఆపి వారిని క‌వ్విస్తూ.. వారికి మ‌సాలా మాటలు చెబుతూ ఫోన్ నంబ‌ర్ల‌ను అడిగి తీసుకుంది. ఈ క్ర‌మంలోనే ఆ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. శ్రీ‌రెడ్డి ఇలా చేసిందేమిటి.. అని నెటిజ‌న్లు సైతం ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now