Naresh : త‌న భార్య మంచిద‌న్న న‌రేష్‌.. మ‌రి ప‌విత్ర‌తో ఉండ‌డం ఎందుకు..?

July 8, 2022 12:54 PM

Naresh : గ‌త కొద్ది రోజులుగా సీనియ‌ర్ న‌టుడు న‌రేష్‌, న‌టి ప‌విత్రా లోకేష్‌ల వ్య‌వ‌హారం ఎక్క‌డ చూసినా వైర‌ల్ అవుతోంది. వీరిద్ద‌రూ స‌హ‌జీవ‌నం చేస్తున్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నార‌ని క‌థ‌లు క‌థ‌లుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే మైసూర్‌లోని ఓ హోట‌ల్‌లో న‌రేష్‌, ప‌విత్ర లోకేష్ ప‌ట్టుబ‌డ‌డం.. త‌రువాత వారు త‌మ మ‌ధ్య ఉన్న బంధాన్ని అంగీక‌రించ‌డంతో.. అంత‌కు ముందు వ‌చ్చిన వార్త‌లే నిజ‌మ‌య్యాయి. అయితే ఇద్ద‌రూ త‌మ పార్ట్‌న‌ర్స్‌తో విడాకులు తీసుకోలేద‌ని.. క‌నుక వివాహం కోస‌మే కాస్త ఆల‌స్యం అవుతుంద‌ని తెలుస్తోంది. అయితే ఈ మ‌ధ్య‌లోనే న‌రేష్ భార్య ర‌మ్య ఎంట‌ర్ అవ‌డంతో మొత్తం ర‌చ్చ ర‌చ్చ అయింది. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో ర‌మ్య క‌న్నా ఎక్కువ‌గా న‌రేష్‌, ప‌విత్ర లోకేష్‌లే ప‌రువు పోగొట్టుకున్నార‌ని చెప్ప‌వ‌చ్చు.

గ‌తంలో న‌రేష్ సినిమా ఇండ‌స్ట్రీలో ఎంతో హుందాగా ఉండేవారు. మా అసోసియేష‌న్‌ను ఆయ‌న త‌న భుజాల‌పై మోశారు. అయితే ఇప్పుడు ఆయ‌న ఏకాకి అయ్యారు. ఆయ‌న విష‌యాల్లో ఎవ‌రూ త‌ల‌దూర్చ‌డం లేదు. ఆయన‌కు మా అసోసియేష‌న్ నుంచే ఎవ‌రూ మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం లేదు. దీంతో న‌రేష్ ప‌రువు పోగొట్టుకున్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది. ఇక ప‌విత్ర లోకేష్ కూడా గ‌తంలో ఫ్యామిలీ న‌టిగా ఎంతో పేరు తెచ్చుకుంది. కానీ ఒకే సంఘ‌ట‌న‌తో ఆమె ప‌రువు మొత్తం పోయింది. ఈ క్ర‌మంలోనే ఆమెను త‌మ సినిమాల్లో పెట్టుకోవాలంటేనే మేక‌ర్స్ భ‌య‌ప‌డుతున్నార‌ట‌. అందుకనే ఆమెను రెండు సినిమాల నుంచి నిర్మాత‌లు తొల‌గించిన‌ట్లు తెలుస్తోంది.

Naresh says his wife Ramya is a good person
Naresh

అయితే గ‌తంలో న‌రేష్ ఒక సంద‌ర్భంలో త‌న భార్య ర‌మ్య గురించి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. త‌న సినిమా కెరీర్ 17 ఏళ్ల‌కే ప్రారంభం అయింద‌ని, 19 ఏళ్ల‌కు పెళ్లి చేశార‌ని తెలిపారు. త‌న‌కు ఇది బాల్య వివాహంలా అనిపించింద‌న్నారు. ఈ క్ర‌మంలోనే ఆమెకు హెల్త్ బాగాలేక‌పోవ‌డంతో విడాకులు ఇచ్చేసిన‌ట్లు తెలిపారు. అయితే త‌న మూడో భార్య ర‌మ్య మాత్రం చాలా మంచిద‌న్నారు. గొప్ప వ్య‌క్తిత్వం ఉన్న మ‌నిష‌ని, త‌న ఆలోచ‌న‌ల‌కు, అభిప్రాయాల‌కు స‌రిపోయే వ్య‌క్తి అని కొనియాడారు. త‌న ఫ్యామిలీలో ర‌మ్య త్వ‌ర‌గా స‌ర్దుకుపోయింద‌ని.. న‌రేష్ అన్నారు.

అయితే న‌రేష్ గ‌తంలో చేసిన వ్యాఖ్య‌ల‌నే ఇప్పుడు మ‌ళ్లీ తెర మీద‌కు తెస్తున్నారు. అప్ప‌ట్లో న‌రేష్ త‌న భార్య ర‌మ్య‌ను అంత‌గా పొడిగారు.. మ‌రి ఇప్పుడేమైంది.. ఎందుకు ఆమెను అలా చిత్రీక‌రిస్తున్నారు.. ఆమెకు అక్ర‌మ సంబంధాల‌ను ఎందుకు అంట‌గ‌డుతున్నారు.. అస‌లు న‌రేష్‌, ర‌మ్య మ‌ధ్య ఏమైంది.. వీట‌న్నింటికీ న‌రేష్ జీవితంలోకి ప‌విత్ర లోకేష్ రావ‌డ‌మే కార‌ణ‌మా.. అని నెటిజన్లు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. అయితే వీరి వ్య‌వ‌హారం చివ‌ర‌కు ఎలా ముగుస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now