Sreeja Konidela : శ్రీ‌జ‌, క‌ల్యాణ్ దేవ్ విడాకుల వ్య‌వ‌హారం.. క్లారిటీ వ‌చ్చేసిన‌ట్లే..?

July 6, 2022 10:03 AM

Sreeja Konidela : చిరంజీవి చిన్న కుమార్తె శ్రీ‌జ‌, ఆమె భ‌ర్త క‌ల్యాణ్‌దేవ్‌ల విడాకుల వ్య‌వ‌హారంపై ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ ఇప్ప‌టికే అనేక సార్లు వార్త‌లు వ‌చ్చాయి. కానీ వీరు మాత్రం ఆ వార్త‌ల‌ను ఖండించ‌లేదు. అయితే తాజాగా మ‌ళ్లీ ఇదే అంశం తెర‌పైకి వ‌చ్చింది. శ్రీ‌జ పెద్ద కుమార్తె నివృతి పుట్టిన రోజు సంద‌ర్భంగా అంద‌రూ విషెస్ చెప్పారు. కానీ క‌ల్యాణ్ దేవ్ మాత్రం విష్ చేయ‌లేదు. దీంతో మ‌ళ్లీ శ్రీ‌జ‌, క‌ల్యాణ్ దేవ్‌ల విడాకుల మ్యాట‌ర్ వైర‌ల్ అవుతోంది.

గ‌తేడాది ఇదే స‌మ‌యంలో క‌ల్యాణ్ దేవ్ నివృతికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాడు. కానీ ఈసారి మాత్రం విషెస్ చెప్ప‌లేదు. దీంతో శ్రీ‌జ‌, క‌ల్యాణ్ దేవ్‌లు విడిపోయార‌న్న విష‌య‌మై కాస్త క్లారిటీ వ‌చ్చిన‌ట్లు అయింది. ఎందుకంటే నివృతి త‌న సొంత కుమార్తె కాక‌పోయినా.. ఇలాంటి వేడుక‌ల్లో అయినా క‌నీసం విషెస్ చెబుతారు. అది కూడా క‌ల్యాణ్ దేవ్ చేయ‌లేదంటే.. ఇక శ్రీ‌జ‌, క‌ల్యాణ్ దేవ్ ఇద్ద‌రూ విడిపోయిన‌ట్లేన‌ని అర్థ‌మ‌వుతోంది. అయితే వీరు విడాకులు తీసుకున్నారా.. తీసుకోబోతున్నారా.. అన్న విష‌యాల‌పై మాత్రం క్లారిటీ రావ‌డం లేదు. కానీ వీరు విడిపోయి వేర్వేరుగా ఉంటున్నార‌న్న విష‌యం మాత్రం అర్థ‌మైపోయింది. ఇక దీనిపై త్వ‌ర‌లో ఏమైనా వివ‌రాలు తెలుస్తాయో చూడాలి.

Sreeja Konidela and Kalyan Dhev divorce issue is it closed
Sreeja Konidela

అయితే నివృతి బ‌ర్త్ డే సంద‌ర్భంగా శ్రీ‌జ‌, ఆమె సోద‌రి సుస్మిత‌తోపాటు నిహారిక కూడా విషెష్ చెప్పింది. శ్రీ‌జ ఏమ‌ని పోస్ట్ పెట్టిందంటే.. హ్యాపీ బ‌ర్త్ డే ప్రిషియ‌స్.. నా జీవితంలోకి వ‌చ్చిన వాటిలో ది బెస్ట్ నువ్వే.. ప్రేమ కంటే ఎక్కువ‌గా నిన్ను ప్రేమిస్తున్నా.. అని పోస్ట్ చేసింది. ఇక సుస్మిత పోస్ట్‌లో.. ఎప్పుడూ నవ్వుతూ, పాజిటివ్ వైబ్స్‌తో అలా ముందుకు వెళ్తూనే ఉండు.. హ్యాపీ బర్త్ డే.. అని పోస్ట్ చేసింది. అలాగే.. హ్యాపీ బర్త్ డే నివి.. ఎంతో స్వీటెస్ట్, జెన్యూన్ బేబీవి నువ్వు.. నీ నవ్వంటే నాకు ఎంతో ఇష్టం.. ఈ ప్రపంచంలోని సంతోషాన్నంతా కూడా పొందే అర్హత నీకు ఉంది.. లవ్‌యూ బంగారం.. అని నిహారిక ఆమెకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment