OTT : ఓటీటీ యాప్‌ల‌లో ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే..!

June 27, 2022 2:31 PM

OTT : వారం వారం ఓటీటీ యాప్‌ల‌లో కొత్త కొత్త సినిమాలు, సిరీస్‌లు సంద‌డి చేస్తున్న విష‌యం విదితమే. అందులో భాగంగానే ప్రేక్ష‌కులు కూడా ఈ వారం ఏయే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. ఏయే సిరీస్‌లు స్ట్రీమ్ అవుతున్నాయి.. అని తెలుసుకునేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు. వారి అభిరుచుల మేర‌కు ఓటీటీ యాప్‌లు కూడా కొత్త కొత్త మూవీలు, సిరీస్‌ల‌ను అందిస్తున్నాయి. ఇక ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్‌ల వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

తెలుగులో తొలిసారిగా మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో ఓటీటీలో వ‌స్తున్న సిరీస్‌.. అన్యాస్ ట్యుటోరియ‌ల్‌. ఈ సిరీస్ ఆహా ప్లాట్‌ఫామ్‌పై స్ట్రీమ్ కానుంది. జూలై 1 నుంచి దీన్ని ప్ర‌సారం చేయ‌నున్నారు. ఇందులో రెజీనా, నివేదిత స‌తీష్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.

OTT movies and series releasing on July 1st 2022
OTT

అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన లేటెస్ట్ చిత్రం.. సామ్రాట్ పృథ్వీరాజ్‌. ఈ మూవీని రూ.300 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించారు. కానీ బాక్సాఫీస్ వ‌ద్ద ఈ చిత్రం నిరాశ ప‌రిచింది. ఏకంగా రూ.150 కోట్ల మేర న‌ష్టాలు వ‌చ్చాయి. అయితే ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రాన్ని జూలై 1వ తేదీన రిలీజ్ చేయ‌నున్నారు.

కంగ‌నా ర‌నౌత్ న‌టించిన ధాక‌డ్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఘోర ప‌రాజ‌యం పాలైంది. అత్యంత భారీ డిజాస్టర్‌గా నిలిచింది. రూ.94 కోట్లు పెట్టి తీస్తే కేవ‌లం రూ.4 కోట్లే వ‌చ్చాయి. అయితే ఈ మూవీకి చాలా రోజుల పాటు ఓటీటీ పార్ట్‌న‌ర్ దొర‌క‌లేదు. కానీ ఎట్ట‌కేల‌కు ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కానుంది. జీ5 యాప్‌లో ఈ సినిమాను జూలై 1వ తేదీన రిలీజ్ చేయ‌నున్నారు.

హాలీవుడ్ హీరో క్రిస్ ప్రాట్ న‌టించిన ది ట‌ర్మిన‌ల్ లిస్ట్ అనే మూవీ కూడా ఈ వార‌మే ఓటీటీలోకి వ‌స్తోంది. నేవీ సీల్ క‌మాండ‌ర్ పాత్ర‌లో ఆయ‌న న‌టించారు. ఈ మూవీ కూడా జూలై 1వ తేదీనే రిలీజ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో దీన్ని చూడ‌వ‌చ్చు. ఇలా ప‌లు సినిమాలు ఈ వారం ఓటీటీల్లో సంద‌డి చేయ‌నున్నాయి.

ott

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment