Dhaakad Movie : ఓటీటీలో రిలీజ్ అవుతున్న కంగ‌నా కొత్త సినిమా..!

June 21, 2022 6:25 PM

Dhaakad Movie : బాలీవుడ్ క్వీన్‌గా పేరుగాంచిన కంగ‌నా ర‌నౌత్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె సినిమాల క‌న్నా వివాదాల కార‌ణంగానే ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ పాపుల‌ర్ అయింది. ఈమె సినిమా రంగం మాత్ర‌మే కాదు.. రాజ‌కీయాల్లోనూ ప‌లు పార్టీల‌పై విమ‌ర్శ‌లు చేస్తుంటుంది. ఫ‌క్తు బీజేపీ ప‌క్ష‌పాతి అయిన కంగ‌నా ర‌నౌత్ వారికి వ్య‌తిరేకంగా ఎవ‌రు ఏం మాట్లాడినా.. ఏం పోస్టులు పెట్టినా.. వారిపై విరుచుకుప‌డుతుంటుంది. అయితే కంగ‌నా ర‌నౌత్ ఒక ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న‌ప్ప‌టికీ ఆమె బ్రాండ్ ఇమేజ్ మాత్రం ఆమె సినిమాకు ఎంత‌మాత్రం ఉపయోగ‌ప‌డ‌లేదు. పైగా ఆమె ఘోర అవ‌మానాన్ని మూట‌గ‌ట్టుకుంది.

కంగ‌నా ర‌నౌత్ న‌టించిన ధాక‌డ్ సినిమా ఈ మ‌ధ్యే థియేట‌ర్ల‌లో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకు తొలి రోజు నుంచే చాలా వ‌ర‌కు థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కులు లేరు. 3వ రోజు సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌ను పూర్తిగా నిలిపివేసి వేరే సినిమాల‌ను ప్ర‌ద‌ర్శించారు. ఈ క్ర‌మంలోనే రూ.95 కోట్ల బ‌డ్జెట్‌తో తీసిన ఈ సినిమా కేవ‌లం రూ.3.77 కోట్ల‌ను మాత్ర‌మే వ‌సూలు చేసింది. భారీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

Kangana Ranaut Dhaakad Movie  releasing on OTT
Dhaakad Movie

అయితే ఇంత‌టి ఫ్లాప్ సినిమాను తీసుకునేందుకు ఓటీటీ యాప్‌లు కూడా వెనుక‌డుగు వేశాయి. కానీ ఎట్ట‌కేల‌కు జీ5 ధైర్యం చేసింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను కొనుగోలు చేసింది. అందులో భాగంగానే జీ5లో జూలై 1వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమాను రాక్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిర్మించ‌గా.. ఇందులో అర్జున్ రామ్‌పాల్‌, దివ్యా ద‌త్తాలు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. మ‌రి ఓటీటీలో ఈ మూవీకి ఎలాంటి స్పంద‌న ల‌భిస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment