Recce Web Series : జీ5లో స్ట్రీమ్ అవుతున్న రెక్కీ వెబ్ సిరీస్‌.. బాగుంద‌ట‌.. ఒక‌సారి చూడండి..!

June 20, 2022 11:32 AM

Recce Web Series : క‌రోనా పుణ్య‌మా అని ఓటీటీ యాప్ ల‌తోపాటు ప్రేక్ష‌కులు కూడా పండుగ చేసుకుంటున్నారు. కొత్త కొత్త సినిమాలు, సిరీస్‌లు ఓటీటీ యాప్‌ల‌లో విడుద‌ల‌వుతూ ప్రేక్ష‌కుల‌ను సంద‌డి చేస్తున్నాయి. గ‌తేడాది ద‌స‌రా వ‌ర‌కు అనేక సినిమాలు ఓటీటీల్లోనే రిలీజ్ అయ్యాయి. త‌రువాత ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌డంతో థియేట‌ర్ల‌లోనే సినిమాల‌ను రిలీజ్ చేస్తున్నారు. కానీ టిక్కెట్ల ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉండ‌డంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వెళ్ల‌డం లేదు. మ‌రీ భారీ బ‌డ్జెట్ సినిమా అయితే త‌ప్ప అగ్ర హీరోలు తీసిన సినిమాలను కూడా ప్రేక్ష‌కులు చూడ‌డం లేదు. కేవ‌లం ఓటీటీల్లోనే చూద్దామ‌ని ఫిక్స్ అవుతున్నారు. అందుక‌నే ఓటీటీ యాప్‌లు ప్రేక్ష‌కుల‌కు కొత్త కొత్త కంటెంట్‌ల‌ను అందించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి.

ఇప్ప‌టికే అనేక ఓటీటీ యాప్‌లు భిన్న‌మైన సినిమాలు, సిరీస్‌ల‌ను నిర్మిస్తూ సంద‌డి చేస్తున్నాయి. గ‌తంలో ఇత‌ర భాష‌ల‌కు చెందిన ఓటీటీ యాప్‌లు మాత్ర‌మే అద్భుత‌మైన సిరీస్‌ల‌ను తీసేవి. కానీ ఇప్పుడు మ‌న మాతృభాష‌లోనూ అలాంటి సిరీస్‌ల‌ను తీస్తున్నారు. ఈ మ‌ధ్యే జీ5 సంస్థ గాలివాన అనే సిరీస్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాగా.. ఇప్పుడు రెక్కీ అనే మ‌రో సిరీస్‌తో ముందుకు వ‌చ్చింది. ఇందులో ప‌లువురు ప్ర‌ముఖ న‌టీన‌టులు కీల‌క‌పాత్ర‌ల‌ను పోషించారు. శివ బాలాజీ, అడుగ‌ళం న‌రేన్‌, శ్రీ‌రామ్‌, జీవా, ధ‌న్య బాల‌కృష్ణ‌, స‌మ్మెట గాంధీ వంటి నటీనటులు ఇందులో అద్భుతంగా న‌టించారు. ఈ క్ర‌మంలోనే ఈ సిరీస్ ఎలాంటి హ‌డావిడి లేకుండానే జీ5 యాప్‌లో విడుద‌లైంది. ఈ సిరీస్ ప్ర‌స్తుతం పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సిరీస్ బాగుంద‌ని చాలా మంది చెబుతున్నారు.

Recce Web Series getting positive talk
Recce Web Series

మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్న రెక్కీ సిరీస్ క‌థ విష‌యానికి వ‌స్తే.. రాయ‌ల‌సీమ‌లోని అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి ప్రాంతంగా ఈ సిరీస్ క‌థ సాగుతుంది. ఇందులో ఓ మున్సిప‌ల్ చైర్మ‌న్‌, త‌రువాత అత‌ని కొడుకు హ‌త్య‌కు గుర‌వుతారు. అయితే ఈ హ‌త్య‌లు చేసింది ఎవ‌రు.. చివ‌ర‌కు ఏమ‌వుతుంది ? వ‌ంటి విష‌యాల‌ను తెలుసుకోవాలంటే.. ఈ సిరీస్‌ను చూడాల్సిందే. క్రైమ్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సిరీస్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. క‌నుక ఈ జోన‌ర్ అంటే ఇష్ట ప‌డేవారు ఒకసారి ఈ సిరీస్‌ను చూడ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment