Vikram Movie : బాహుబ‌లి 2ను బీట్ చేసిన క‌మ‌ల్ హాస‌న్ విక్ర‌మ్ మూవీ..!

June 20, 2022 10:01 AM

Vikram Movie : క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన విక్ర‌మ్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ మూవీ క‌మ‌ల్ హాస‌న్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ క్ర‌మంలోనే తెలుగు, త‌మిళంల‌లో ఈ మూవీ రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్ల‌ను వ‌సూలు చేస్తోంది. ఇప్ప‌టికీ ఈ మూవీ ఇంకా 60 శాతం మేర థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శితం అవుతూనే ఉంది. ఈ మూవీ రిలీజ్ అయిన తొలి రోజే రూ.30 కోట్ల మేర క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్ట‌డం విశేషం. అలాగే రోజు రోజుకీ ఈ మూవీ వ‌సూలు చేస్తున్న క‌లెక్ష‌న్స్ పెరుగుతున్నాయే త‌ప్ప త‌గ్గ‌డం లేదు.

ఇక విక్ర‌మ్ మూవీ త‌మిళ‌నాడులో బాహుబ‌లి 2 క‌లెక్ష‌న్స్‌ను బీట్ చేసింది. అక్క‌డ ఆల్ టైమ్ హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్ల‌ను వ‌సూలు చేసిన మూవీగా విక్ర‌మ్ నిలిచింది. త‌మిళ‌నాడులో విక్ర‌మ్ మూవీ రూ.150 కోట్ల‌కు పైగా వ‌సూలు చేయ‌డం విశేషం. ఇక ఈ మూవీ 16 రోజుల్లో మొత్తం రూ.300 కోట్ల‌ను వ‌సూలు చేసింది. ఈ మూవీ చాలా అద్భుతంగా ఉంద‌ని ప్రేక్ష‌కులు అంటుండ‌గా.. కొంద‌రైతే ఏకంగా కేజీఎఫ్ 2ను మించిపోయింద‌ని అంటున్నారు. అయితే వాస్త‌వానికి కేజీఎఫ్ 2, విక్ర‌మ్ రెండూ వేర్వేరు క‌థ‌లకు చెందిన సినిమాలు. క‌నుక రెండింటినీ పోల్చ‌లేమ‌ని ఇంకొంద‌రు అంటున్నారు.

Vikram Movie beats Bahubali 2 collections in Tamil Nadu
Vikram Movie

ఇక విక్ర‌మ్ సినిమాలోని యాక్ష‌న్ సీన్లు ప్ర‌ధానంగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. అలాగే ఇందులో విజ‌య్ సేతుప‌తి, ఫ‌హాద్ ఫాసిల్‌ల పాత్ర‌లు కూడా ఈ మూవీకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ అని చెప్ప‌వ‌చ్చు. అలాగే క్లైమాక్స్‌లో న‌టుడు సూర్య ఎంట్రీ సీన్ ఉంటుంది. ఇది కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. క‌నుక‌నే ఈ మూవీకి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇక ప్ర‌స్తుతం విక్ర‌మ్ చిత్ర యూనిట్ సక్సెస్ సెల‌బ్రేష‌న్స్‌లో మునిగి తేలుతోంది. క‌మ‌ల్ హాస‌న్ చిత్ర యూనిట్ స‌భ్యుల‌కు ఇప్ప‌టికే ప‌లు ర‌కాల గిఫ్ట్‌ల‌ను అందించారు. కాగా విక్ర‌మ్ సినిమాను లోకేష్ క‌న‌గ‌రాజ్ తెర‌కెక్కించ‌గా.. ఆయ‌నే క‌థ‌ను అందించారు. అలాగే రాజ్ క‌మ‌ల్ ఫిలిమ్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఈ మూవీని నిర్మించింది. ఇందులో ఉన్న యాక్ష‌న్ సీన్ల కార‌ణంగానే ఈ మూవీ హిట్ అయింద‌ని ప్రేక్ష‌కులు అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment