Nayanthara : కొత్త‌గా పెళ్ల‌యిన‌ప్ప‌టికీ న‌య‌న‌తార‌కు నో బ్రేక్‌..!

June 18, 2022 10:14 PM

Nayanthara : లేడీ సూప‌ర్ స్టార్‌గా పేరుగాంచిన న‌య‌న‌తార ఈ మ‌ధ్యే ద‌ర్శ‌కుడు విగ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకున్న విష‌యం విదిత‌మే. జూన్ 9వ తేదీన వీరి వివాహం జ‌రిగింది. ఈ వేడుక‌కు అనేక మంది సెల‌బ్రిటీలు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు తిరుమ‌ల శ్రీ‌వారిని కూడా ద‌ర్శించుకున్నారు. అయితే మాడ వీధుల్లో వీరు చెప్పులు వేసుకుని తిర‌గ‌డం వివాదాస్ప‌దం అయింది. దీంతో టీటీడీ వివ‌ర‌ణ అడ‌గ్గా.. వీరు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. అయితే న‌య‌న‌తార ఇప్ప‌టికే ప‌లు సినిమాల‌తో బిజీగా ఉండ‌గా.. క‌నీసం పెళ్లి అయ్యాక అయినా.. ఈమె కొన్ని రోజుల పాటు బ్రేక్ తీసుకుంటుంద‌ని అనుకున్నారు. కానీ న‌య‌న‌తార మ‌ళ్లీ షూటింగ్‌ల‌తో బిజీ కానుంది.

కొత్తగా పెళ్లయిన‌ప్ప‌టికీ న‌య‌న‌తార సినిమాల నుంచి మాత్రం బ్రేక్ తీసుకోవ‌డం లేద‌ని తెలుస్తోంది. ఆమె ఇప్ప‌టికే షారూక్ ఖాన్ మూవీలో న‌టించాల్సి ఉంది. అట్లీ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. జ‌వాన్ పేరిట ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఇందులో మొద‌ట స‌మంత‌ను అనుకున్నారు. కానీ ప‌లు కార‌ణాల వ‌ల్ల ఆమె నో చెప్ప‌గా.. న‌య‌న‌తారను ఆమె ప్లేస్‌లో తీసుకున్నారు. అయితే ఇప్ప‌టికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా.. ఇందులో షారూక్ ఖాన్‌కు చెందిన సీన్ల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే న‌య‌న‌తార ఈ చిత్ర యూనిట్‌తో త్వ‌ర‌లో క‌ల‌వ‌నుంది.

Nayanthara not taking break from movies even she is married
Nayanthara

ఇక చిరంజీవి గాడ్ ఫాద‌ర్ మూవీలనూ న‌య‌న‌తార న‌టిస్తోంది. ఇందులో ఆయ‌న చెల్లెలి పాత్ర‌లో న‌య‌న‌తార న‌టిస్తుంద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే మ‌రో రెండు మూడు రోజుల్లో ఈమె హైద‌రాబాద్‌కు వెళ్ల‌నుంద‌ని స‌మాచారం. అయితే న‌య‌న‌తార తాను చేస్తున్న చిత్రాల‌కు చెందిన షూటింగ్‌ను త్వ‌ర‌గా పూర్తి చేసుకుని ఆ త‌రువాత బ్రేక్ తీసుకుంటుంద‌ని తెలుస్తోంది. ఇంత‌కు ముందు సోన‌మ్‌క‌పూర్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా ఇలాగే చేశారు. క‌నుక కొత్త‌గా పెళ్ల‌యిన‌ప్ప‌టికీ న‌య‌న‌తార మాత్రం బ్రేక్ తీసుకోవ‌డం లేద‌ని స్ప‌ష్టం అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment