Manchu Lakshmi : అరుంధ‌తి సినిమా నేనే చేయాల్సి ఉంది.. కానీ అందుకే వీలు కాలేదు: మంచు ల‌క్ష్మి

June 17, 2022 9:51 PM

Manchu Lakshmi : కోడి రామ‌కృష్ణ దర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అరుంధ‌తి మూవీ అప్ప‌ట్లో ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇందులో అనుష్క శెట్టి అద్భుతంగా న‌టించి రెండు పాత్ర‌ల‌కు జీవం పోసింది. ముఖ్యంగా జేజ‌మ్మ పాత్ర‌లో అనుష్క న‌ట‌న అమోఘ‌మ‌నే చెప్పాలి. 2009 జ‌న‌వ‌రి 16వ తేదీన రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. దీంతో అప్ప‌ట్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు డిమాండ్ బాగా పెరిగింది. అయితే ఈ సినిమాలో అనుష్క శెట్టి కాకుండా ఇత‌ర ఏ హీరోయిన్ చేసినా అంత‌గా సెట్ కార‌నే చెప్పాలి. ఎందుకంటే అనుష్క ఆ పాత్ర‌లో జీవించేసింది. అయితే ఈ సినిమాపై మంచు ల‌క్ష్మి గ‌తంలో ఓ సారి చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి.

అరుంధ‌తి సినిమా గురించి అనుష్క శెట్టితో మంచు ల‌క్ష్మి ఒక‌సారి మాట్లాడింది. వాస్త‌వానికి తాను అరుంధ‌తి సినిమా చేయాల్సి ఉంద‌ని.. కానీ డేట్స్ అడ్జ‌స్ట్ కాలేద‌ని మంచు ల‌క్ష్మి తెలియ‌జేసింది. అయితే ఈ సినిమాను తాను చేసేదాన్న‌ని కాద‌ని.. ఎందుకంటే త‌న‌కు దెయ్యం అంటే భ‌య‌మని.. దెయ్యం సినిమాలు తాను చూడ‌న‌ని.. క‌నుక ఈ సినిమాలో న‌టించ‌మ‌ని అడిగినా.. తాను నో చెప్పేదాన్న‌న‌ని.. మంచు ల‌క్ష్మి తెలియ‌జేసింది. అయితే మంచు ల‌క్ష్మి ఈ కామెంట్స్ చేసి కూడా చాలా రోజులు అవుతోంది. కానీ ఆమె వీడియోను ఇప్పుడు వైర‌ల్ చేస్తున్నారు.

Manchu Lakshmi said about Arundhathi movie comments viral
Manchu Lakshmi

ఈ మ‌ధ్య కాలంలో మంచు ఫ్యామిలీపై ట్రోల్స్ విప‌రీతంగా పెరిగిపోయాయి. అందులో భాగంగానే మంచు ల‌క్ష్మిపై కూడా ట్రోల్స్ బాగా వ‌స్తున్నాయి. ఇక అరుంధ‌తి సినిమా గురించి ఆమె చేసిన పాత కామెంట్స్‌ను ఆస‌ర‌గా తీసుకుని ఆ వీడియోను బ‌య‌ట‌కు తెచ్చి మ‌రీ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె కామెంట్స్ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

https://youtu.be/uepAnYCBm_I

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now