Samantha : తాను ఎంతో మంచిదాన్న‌ని చెప్పుకుంటున్న స‌మంత‌..!

June 15, 2022 6:09 PM

Samantha : నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన త‌రువాత నుంచి స‌మంత ఎంతో మారిపోయింద‌ని చెప్ప‌వ‌చ్చు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఆమె గ్లామ‌ర్ షో చేస్తోంది. అందాల ఆర‌బోతే ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఓ వైపు సినిమాల‌తో బిజీగా ఉంటూనే మ‌రోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లో ప‌లు బ్రాండ్ల‌ను ప్ర‌మోట్ చేస్తూ నెల‌కు రూ.3 కోట్ల వ‌ర‌కు సంపాదిస్తోంది. అయితే నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన త‌రువాత కొంత కాలం పాటు స‌మంత మామ్స్ సెయిడ్ పేరిట ప‌లు కొటేష‌న్స్‌ను షేర్ చేసింది. కానీ ఏమైందో తెలియ‌దు. కొంత కాలం నుంచి కొటేష‌న్స్‌ను షేర్ చేయ‌డం లేదు.

కొంత కాలం నుంచి స‌మంత కొటేష‌న్స్‌ను షేర్ చేయ‌క‌పోగా.. త‌న అప్‌డేట్స్ గురించే ఎక్కువ‌గా పోస్ట్‌లు పెడుతోంది. అయితే ఉన్న‌ట్లుండి స‌డెన్‌గా కొటేష‌న్స్‌ను పెట్టాల‌నిపించింది కాబోలు.. వెంట‌నే మ‌ళ్లీ ఓ కొటేష‌న్‌ను పెట్టింది. మ‌నం ఎదుటి వారిలో మంచిత‌నాన్ని ఎందుకు చూస్తామంటే.. మ‌న‌లో కూడా మంచిత‌నం ఉంటుంది కాబ‌ట్టి.. అనే కొటేష‌న్‌ను షేర్ చేసింది. అయితే ఈ కొటేష‌న్ ద్వారా స‌మంత ప‌రోక్షంగా త‌న‌ను తాను మంచిదాన్న‌ని చెప్పుకుంటుంద‌ని తెలుస్తోంది.

Samantha indirectly says she is a very good woman
Samantha

సాధార‌ణంగా మ‌నం చెడ్డ వాళ్లం అయితే ఎదుటి వారిలోనూ చెడ్డ ల‌క్ష‌ణాల‌ను వెదుకుతాం. అదే మ‌నం మంచి వాళ్లం అయితే ఎదుటి వారిలో కూడా మంచినే చూస్తాం. అంటే స‌మంత ఎదుటి వారిలో మంచినే చూస్తాన‌ని చెబుతోంది. దాన‌ర్థం తాను మంచిది అన్న‌ట్లే క‌దా. ఇలా స‌మంత త‌న‌ను తాను మంచిదాన్న‌ని ప‌రోక్షంగా సోష‌ల్ మీడియా ద్వారా చెప్పుకుంటుంద‌న్న‌మాట‌. ఈ మ‌ధ్య కాలంలో ఆమెపై ఎక్కడ చూసినా నెగెటివ్ కామెంట్స్ వ‌స్తున్నాయి. క‌నుక‌నే ఆమె ఇలాంటి పోస్ట్ పెట్టిందా.. అని చ‌ర్చించుకుంటున్నారు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే స‌మంత ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి ఖుషి అనే మూవీలో న‌టిస్తుండ‌గా.. య‌శోద అనే సినిమాలోనూ యాక్ట్ చేస్తోంది. ఈ రెండు మూవీలు కూడా త్వ‌ర‌లోనే రిలీజ్ కానున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment