Viral Video : వాహ్‌.. త‌న‌ను వేధిస్తున్న 6 మంది యువ‌కుల‌ను.. ఎగిరెగిరి త‌న్నిన యువ‌తి.. వీడియో..!

June 14, 2022 7:49 PM

Viral Video : ప్ర‌స్తుత త‌రుణంలో మ‌హిళ‌లు స‌మాజంలో వివ‌క్ష‌ను, వేధింపుల‌ను ఎదుర్కొంటున్నారు. ప్ర‌తి సెక‌నుకు ప్ర‌పంచంలో ఏదో ఒక చోట మ‌హిళ‌లు వేధింపుల‌కు గుర‌వుతూనే ఉన్నారు. ప‌నిచేసే చోట‌, బ‌హిరంగ ప్ర‌దేశాల్లో, ఇళ్ల‌లోనూ కామాంధులు మ‌హిళ‌ల‌ను విడిచిపెట్ట‌డం లేదు. చిన్నారుల‌ను సైతం చెర‌బ‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి దేశంలోనూ మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అయితే కొంద‌రు మ‌హిళ‌లు మాత్రం త‌మ‌ను వేధించే వారికి చాలా గ‌ట్టిగా బుద్ధి చెబుతున్నారు. అక్క‌డ కూడా అలాగే జ‌రిగింది. ఓ యువ‌తి త‌న‌ను వేధిస్తున్న కొంద‌రు యువ‌కుల‌కు దీటుగా స‌మాధానం చెప్పింది. ఇంత‌కీ అసలు ఏం జ‌రిగిందంటే..

ఓ యువ‌తి రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్తుండగా.. 6 మంది యువ‌కులు ఆమెను వేధించ‌డం మొద‌లు పెట్టారు. ఆమె చుట్టూ వారు చేరి ఆమెను వేధించ‌సాగారు. అయితే ఉన్న‌ట్లుంగా ఆ యువ‌తి సివంగిగా రెచ్చిపోయింది. త‌న చుట్టూ ఉన్న యువ‌కుల‌ను ఒక్క‌సారే త‌న్నింది. దీంతో అంద‌రూ చెల్లా చెదురు అయ్యారు. త‌రువాత ఒక్కో యువ‌కున్ని ప‌ట్టుకుని గాల్లోకి ఎగిరి మ‌రీ వాళ్ల‌ను త‌న్నింది. వాళ్ల‌కు క‌రాటే పంచ్‌లు ఇచ్చింది. దీంతో ఆ యువ‌కులు అక్క‌డి నుంచి దెబ్బ‌కు ప‌రార‌య్యారు. అలా ఆ యువ‌తి త‌న‌ను వేధిస్తున్న యువ‌కుల‌కు గట్టిగా బుద్ధి చెప్పింది.

girl fight with youth Viral Video
Viral Video

అయితే అదే స‌మ‌యంలో అక్క‌డే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఈ సంఘ‌ట‌న తాలూకు దృశ్యాలు రికార్డ‌య్యాయి. దీంతో ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. చాలా మంది ఆ వీడియోను చూసి కామెంట్లు పెడుతున్నారు. ఆ యువ‌తి ధైర్యానికి ఆమెను ప్ర‌శంసిస్తున్నారు. అలాంటి వారికి అలాగే బుద్ధి చెప్పాల‌ని ఆమెను అభినందిస్తున్నారు. ఇక ఈ వీడియోకు ఇప్ప‌టికే 35 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ రాగా.. 9వేల‌కు పైగా ఈ వీడియోను షేర్ చేశారు. ఈ క్ర‌మంలోనే ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

https://twitter.com/TheFigen/status/1535610309309874176

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now