Manchu Vishnu : మ‌ళ్లీ వివాదంలో మంచు విష్ణు.. సినిమా టైటిల్ మార్చాల్సిందేనా..?

June 12, 2022 7:10 PM

Manchu Vishnu : సినీ న‌టుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) అధ్య‌క్షుడు మంచు విష్ణు ఈ మ‌ధ్య కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆయ‌న హీరోగా, స‌న్నీ లియ‌న్‌, పాయ‌ల్ రాజ్‌పూత్ హీరోయిన్లుగా గాలి నాగేశ్వ‌ర్ రావు అనే మూవీ తెర‌కెక్కుతున్న విష‌యం విదిత‌మే. అయితే ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ కోసం ఇప్ప‌టికే ఇద్ద‌రు హీరోయిన్ల‌తో క‌లిసి మంచు విష్ణు ప‌లు పోస్ట్‌లు పెట్టాడు. అవ‌న్నీ వైర‌ల్ అయ్యాయి. అయితే కొన్ని పోస్టుల‌కు మాత్రం మంచు విష్ణుపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇక తాజాగా మ‌ళ్లీ ఇదే మూవీపై వివాదం నెల‌కొంది. ఈ మూవీ టైటిల్‌ను జిన్నాగా మారుస్తూ మేక‌ర్స్ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో ఈ విష‌యం వివాదాస్ప‌దం అవుతోంది. ఈ టైటిల్‌ను మార్చాల‌ని బీజేపీ నేత‌లు డిమాండ్ చేస్తున్నారు.

మంచు విష్ణు జిన్నా సినిమాకు గాను ఆ టైటిల్ ఎందుకు పెడుతున్నారో ర‌చ‌యిత కోన వెంక‌ట్ ఓ వీడియోలో వివ‌రించారు. ఈ చిత్రానికి టైటిల్‌గా జిన్నా అని పెట్టిన‌ట్లు చెప్పారు. అయితే జిన్నా ఎందుకు పెట్టారు.. అది వివాదాస్ప‌దం అవుతుందేమో.. అని విష్ణు అడ‌గ్గా.. అందుకు కోన వెంక‌ట్ స్పందిస్తూ.. వివాదం ఏమీ కాదండీ.. మ‌న హీరో పేరు జి.నాగేశ్వ‌ర్ రావు. అది అత‌నికి న‌చ్చ‌దు. క‌నుక‌నే జిన్నాగా మార్చుకుంటాడు.. అని చెబుతారు. అయితే ఈ వీడియోను చూశారో లేదో తెలియ‌దు కానీ బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి ఈ సినిమా టైటిల్‌పై అభ్యంత‌రం చెప్పారు. జిన్నా పేరుతో ఉన్న సినిమా టైటిల్‌ను వెంట‌నే తొల‌గించాల‌ని అన్నారు. జిన్నా గురించి విష్ణుకు తెలియ‌దేమో.. ఎంతో మంది ఊచ‌కోత‌కు కార‌ణ‌మైన జిన్నా పేరును సినిమా టైటిల్‌గా పెట్ట‌డం ఏమిటి.. వెంట‌నే తొల‌గించాలి.. అని విష్ణు వ‌ర్ధ‌న్ రెడ్డి ట్వీట్ చేశారు.

Manchu Vishnu again in controversy for his latest film
Manchu Vishnu

కాగా ఈ విష‌యంపై మంచు విష్ణు ఇంకా స్పందించ‌లేదు. ఈ మూవీకి ఈషాన్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ, అవ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై మంచు విష్ణు స్వ‌యంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి క‌థ‌, స్క్రీన్ ప్లే కోన వెంక‌ట్ అందిస్తున్నారు. అలాగే ఈయ‌న క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌గానూ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గ‌తంలో కోన వెంక‌ట్ మంచు విష్ణు హీరోగా వ‌చ్చిన ఢీ, దేనికైనా రెడీ చిత్రాల‌కు స్క్రీన్ ప్లే అందించారు. ఈ మూవీకి మూల క‌థ‌ను జి.నాగేశ్వ‌ర్ రెడ్డి అందిస్తుండ‌గా.. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment