Samantha : నాగ‌చైత‌న్య‌ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్న స‌మంత‌.. సాక్ష్యం అదే..?

June 10, 2022 11:09 AM

Samantha : స‌మంత టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా కొన‌సాగుతోంది. అయితే ఈమెకు ఈ పేరు అంతా ఒకే రోజులో రాలేదు. న‌టిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును ఈమె సొంతం చేసుకుంది. దీనికి తోడు మొన్న‌టి వ‌ర‌కు అక్కినేని కోడ‌లిగా ఉంది. క‌నుక స‌మంత‌కు ప్రాధాన్య‌త‌ను ఇచ్చారు. నాగ‌చైత‌న్య‌ను ఈమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఏం మాయ చేశావె సినిమా ద్వారా వీరు ప్రేమ‌లో ప‌డ్డారు. అప్ప‌టి నుంచి ఎవ‌రికీ తెలియ‌కుండా ఎంతో సీక్రెట్‌గా వీరు త‌మ ప్రేమాయణం కొన‌సాగించారు. ఎట్ట‌కేల‌కు పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. క్రిస్టియ‌న్‌, హిందూ ప‌ద్ధ‌తుల్లో వీరు వివాహం చేసుకున్నారు.

అయితే వివాహం త‌రువాత వీరు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. స‌మంత య‌థావిధిగా సినిమాల్లో న‌టించింది. అయితే ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ.. వీరు స‌డెన్ గా విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించి షాకిచ్చారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఎవ‌రి ప‌నుల్లో వారు బిజీగా ఉన్నారు. అయితే అంత‌లా ప్రేమించుకుని అన్యోన్యంగా ఉన్న జంట స‌డెన్ గా విడాకులు ఎందుకు తీసుకుందో అర్థం కాలేదు. చాలా మంది మెద‌ళ్ల‌ను ఇప్ప‌టికీ ఈ ప్ర‌శ్న తొలుస్తూనే ఉంది. అయితే స‌మంత మాత్రం ఇంకా నాగ‌చైత‌న్య‌ను మ‌రిచిపోన‌ట్లు క‌నిపిస్తోంది. అందుకు ఆమె శ‌రీరంపై ఉన్న టాటూలే సాక్ష్య‌మ‌ని చెప్ప‌వ‌చ్చు.

Samantha still loves Naga Chaitanya here it is the proof
Samantha

ఈ మ‌ధ్యే స‌మంత ఓ బ్రాండ్‌కు చెందిన బికినీకి యాడ్ చేసింది. న‌లుపు రంగు బికినీ ధ‌రించి గ్లామ‌ర‌స్ పోజులు ఇచ్చింది. అయితే ఆమె ఫొటో వైర‌ల్ అయింది. కాగా అందులో స‌మంత కుడి వైపు ఛాతి కింది భాగంలో చై అనే టాటూ ఇంకా అలాగే ఉంది. దీన్ని కాస్త అస్ప‌ష్టంగానైనా స‌రే చూడ‌వ‌చ్చు. చైత‌న్య‌ను వివాహం చేసుకున్నాక వేయించుకున్న టాటూ అది. అయితే చైతూకు విడాకులు ఇచ్చాక అత‌నికి సంబంధించిన గుర్తుల‌ను ఆమె చెరిపేసింది. దీంతో టాటూల‌ను కూడా తీయించుకుంద‌ని భావించారు. కానీ లేటెస్ట్ ఫొటోను చూస్తే మాత్రం ఆ టాటూ ఇంకా అలాగే ఉంది. అంటే చైత‌న్య మీద స‌మంత‌కు ఇంకా ప్రేమ పోలేద‌ని.. అత‌న్ని ఇంకా ప్రేమిస్తూనే ఉంద‌ని.. క‌నుక‌నే చై అనే టాటూను ఆమె అలాగే ఉంచింద‌ని.. తెలుస్తోంది.

అయితే నిజంగానే చైత‌న్య‌ను మరిచిపోలేకే ఆమె ఇలా టాటూను ఇంకా ఉంచిందా.. లేక ఆ విష‌యం మ‌రిచిపోయిందా.. అన్న వివ‌రాలు అయితే తెలియ‌వు. కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైర‌ల్ అవుతోంది. ఇక భ‌విష్య‌త్తులో వీరు క‌లుస్తార‌ని అందుక‌నే స‌మంత అలా టాటూను ఉంచేసింద‌ని.. అంటున్నారు. ఇక ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న‌ది తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment