Sushanth : సుశాంత్‌ను దారుణంగా ఆ మాట‌ అడిగేసిన నెటిజ‌న్‌.. అందుకు సుశాంత్ ఇచ్చిన రిప్లై అదుర్స్‌..!

June 6, 2022 8:14 AM

Sushanth : సోష‌ల్ మీడియా లేని రోజుల్లో హీరోలు, హీరోయిన్లు ఏదైనా ప‌త్రిక‌కో లేదా చాన‌ల్‌కో ఇచ్చే ఇంట‌ర్వ్యూల‌నే ఎక్కువ‌గా ప్రేక్ష‌కులు చూసే వాళ్లు. ఇంట‌ర్వ్యూల‌లో జ‌ర్న‌లిస్టులు అడిగే ప్ర‌శ్న‌ల‌కు వారు చెప్పే స‌మాధానాలు తెలుసుకుని అక్క‌డి వ‌ర‌కే ప్రేక్ష‌కులు సంతృప్తి ప‌డేవారు. కానీ ఇప్పుడు సోష‌ల్ మీడియా వ‌చ్చాక‌.. అలాంటి ఇంట‌ర్వ్యూల‌తో ప‌నిలేకుండా పోయింది. త‌మ అభిమాన హీరో లేదా హీరోయిన్‌ల‌ను ఫ్యాన్సే నేరుగా ప్ర‌శ్న‌లు అడుగుతున్నాడు. అయితే నెటిజన్లు స‌రిగ్గా ప్ర‌శ్న‌లు అడిగి అందుకు సెల‌బ్రిటీలు స‌రిగ్గా జ‌వాబులు చెబితే ఓకే. లేదంటే ఇబ్బందులు వ‌స్తాయి. ముఖ్యంగా కొన్ని సంద‌ర్భాల్లో నెటిజ‌న్లు వింతైన ప్ర‌శ్న‌లు అడుగుతుంటారు. దీంతో అలాంటి ప్ర‌శ్న‌ల‌కు సెల‌బ్రిటీలు చెప్పే స‌మాధానాలు వైర‌ల్ అవుతుంటాయి. ఇక తాజాగా న‌టుడు సుశాంత్‌కు కూడా ఇలాంటి అనుభ‌వ‌మే ఎదురైంది. ఓ నెటిజ‌న్ సుశాంత్‌ను చాలా దారుణంగా ఓ మాట అడిగేశాడు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే..

న‌టుడు సుశాంత్ ఇటీవ‌ల త‌న సోష‌ల్ ఖాతాలో లైవ్ నిర్వ‌హించాడు. అభిమానులు అడిగే ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధానాలు చెప్పారు. అయితే ఓ నెటిజ‌న్ మాత్రం నువ్వు ఇంకా వ‌ర్జిన్‌వేనా.. అని సుశాంత్‌ను అడిగేశాడు. అయితే దీనికి సుశాంత్ త‌డుముకోకుండా.. నిప్పు సింబ‌ల్‌ను చూపించాడు. అంటే.. తాను ఇంకా నిప్పునేన‌ని, త‌న శీలం ప‌దిలంగానే ఉంద‌ని ఆయ‌న అలా సింబాలిక్‌గా చెప్పార‌న్న‌మాట‌. అంటే ఆయ‌న ఇంకా వర్జినే అన్న విష‌యం స్ప‌ష్ట‌మైంది.

Sushanth given stron reply to a netizen who asked about his marriage
Sushanth

ఇక ఇంకో నెటిజ‌న్ మీ పెళ్లి తేదీ ఎప్పుడు అని అడ‌గ్గా.. ఇంకా అమ్మాయినే వెతుక్కోలేదు. అప్పుడే పెళ్లి తేదీ ఎలా చెప్ప‌గ‌లను.. అంటూ సుశాంత్ స‌మాధానం చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన ఇచ్చిన రిప్లైస్ అదిరిపోయేలా ఉన్నాయ‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక మ‌ళ్లీ బ‌న్నీతో ఎప్పుడు క‌ల‌సి న‌టిస్తారు.. అని అడ‌గ్గా.. చాన్స్ వ‌స్తే అల వైకుంఠ‌పుర‌ములో సెకండ్ పార్ట్‌లో న‌టిస్తాన‌ని.. అయితే దీనిపై బ‌న్నీని కూడా అడ‌గాల‌ని సుశాంత్ చెప్పారు. సుశాంత్ అల వైకుంఠ పుర‌ములో సినిమాలో ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. ఆ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది. అయితే సుశాంత్ నేరుగా చేస్తున్న చిత్రాలు ఏవీ హిట్ కావ‌డం లేదు. దీంతో ఆయ‌న ఇత‌ర హీరోల సినిమాల్లో న‌టిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment