Sitara : మ‌హేష్ కుమార్తె సితారలోని ఈ టాలెంట్ చూశారా..? వీడియో..!

June 5, 2022 1:42 PM

Sitara : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కుమార్తె సితార గురించి తెలుగు ప్రేక్ష‌కులకు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె సోష‌ల్ మీడియాలో ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. త‌న అప్ డేట్స్ ను అందులో షేర్ చేస్తుంటుంది. అందులో భాగంగానే సితార ఎక్కువ‌గా డ్యాన్స్ వీడియోల‌ను పోస్ట్ చేస్తుంటుంది. అంతేకాదు.. ఆమె చ‌క్క‌గా యాక్ట్ చేస్తుంది కూడా. అలాగే సింగింగ్, పెయింటింగ్ వంటి క‌ళ‌ల్లోనూ ఆమెకు ప్రవేశం ఉంది. దీంతో సితార ప్ర‌తిభ ఏంటో ఇప్ప‌టికే నిరూపించుకుంది. ఆమె వీడియోల‌ను చూసి నెటిజ‌న్లు కూడా ఆశ్చ‌ర్య‌పోతుంటారు.

ఇక సితార ఈ మ‌ధ్యే త‌న తండ్రి సినిమా స‌ర్కారు వారి పాట‌లో పెన్నీ సాంగ్‌లో క‌నిపించి అల‌రించింది. అలాగే శ్రీ‌రామ‌న‌వ‌మి సంద‌ర్భంగా సంప్ర‌దాయ దుస్తుల‌ను ధ‌రించి కూచిపూడి నృత్యం చేసింది. దీంతో ఆమె డ్యాన్స్ వీడియో వైర‌ల్ అయింది. అయితే సితార‌లో కేవ‌లం ఈ క‌ళ‌లే కాదు.. ఇంకా ఆమెకు గుర్ర‌పు స్వారీ కూడా తెలుసు. త‌న తాత కృష్ణ‌, తండ్రి మ‌హేష్‌ల‌కు గుర్ర‌పు స్వారీ వ‌చ్చు. ఇక సితార కూడా హార్స్ రైడింగ్ నేర్చుకుంది. దీంతో తాజాగా ఆమె హార్స్ రైడింగ్ చేస్తున్న వీడియోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఆ వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి.

Mahesh Babu daughter Sitara learns horse riding
Sitara

అయితే సితార ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క మూవీలో కూడా న‌టించ‌లేదు. కానీ ఈమె త్వ‌ర‌లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంద‌ని అంటున్నారు. మ‌హేష్ త్వ‌ర‌లో త్రివిక్ర‌మ్‌తో సినిమా చేయ‌నున్నారు. ఇందులో ఈయ‌న‌కు జోడీగా పూజా హెగ్డె న‌టించ‌నుంది. అలాగే వ‌చ్చే ఏడాది రాజ‌మౌళి ద‌ర్శ‌కత్వంలో మ‌హేష్ న‌టించ‌నున్నారు. అయితే ఈ మూవీలో సితార‌కు చాన్స్ ఇస్తార‌ని తెలుస్తోంది. దీనిపై కొంత కాలం ఆగితే స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment