Anasuya : భ‌ర్త‌తో అన‌సూయ హ‌ల్‌చ‌ల్‌.. బీచ్‌లో అందాల విందు చేస్తూ.. భ‌ర్త‌కు లిప్‌లాక్‌..

June 4, 2022 10:24 AM

Anasuya : తెలుగు ప్రేక్ష‌కులకు అన‌సూయ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. రంగ‌మ్మ‌త్త‌గా పేరుగాంచిన అన‌సూయ అటు బుల్లితెర‌తోపాటు ఇటు వెండితెర ప్రేక్ష‌కుల‌ను కూడా అల‌రిస్తుంటుంది. ఈ మ‌ధ్య కాలంలో ఓ వైపు టీవీ షోల‌తోపాటు మ‌రోవైపు సినిమాల‌తోనూ అన‌సూయ ఎంతో బిజీగా మారింది. అందులో భాగంగానే ఆమె వ‌రుస సినిమాల‌ను చేస్తూ అల‌రిస్తోంది. ఇక ఎప్ప‌టిక‌ప్పుడు ఈమె త‌న అప్‌డేట్స్‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది.

సోష‌ల్ మీడియాలో అన‌సూయ చేసే ర‌చ్చ మామూలుగా ఉండ‌దు. గ్లామ‌ర్ ఫొటోషూట్స్‌తో అల‌రిస్తూనే.. త‌న సినిమాల అప్‌డేట్స్ గురించి చెబుతుంటుంది. అలాగే వెకేష‌న్స్‌కు కూడా వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటుంది. ఈ మ‌ధ్యే అన‌సూయ త‌న బ‌ర్త్ డేను జ‌రుపుకోగా.. అందాల విందు చేసేలా ఫొటోల‌ను షేర్ చేసింది. ఇక ఇప్పుడు కూడా అలాంటి ఫొటోల‌నే ఆమె షేర్ చేసింది. త‌న వివాహ వార్షికోత్సవం సంద‌ర్భంగా భ‌ర్త సుశాంక్ భ‌ర‌ద్వాజ్‌తో క‌లిసి ఈమె వెకేష‌న్‌కు వెళ్లింది. అక్క‌డ తీసుకున్న వీడియోను షేర్ చేసింది. అది సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Anasuya in vacation on her wedding anniversary
Anasuya

త‌మ వివాహ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా పోస్ట్ చేసిన స్పెష‌ల్ వీడియోకు అన‌సూయ కాప్ష‌న్ ను కూడా పెట్టింది. త‌న భ‌ర్త‌ను ముద్దుగా నిక్కు అని పిలుచుకుంటున్న అన‌సూయ‌.. తామిద్ద‌రం అలా సంతోషంగా గ‌డుపుతున్నందుకు ఎంతో హ్యాపీగా ఉంద‌ని తెలిపింది. ఇద్ద‌రం ఇలాగే జీవితాంతం క‌ల‌సి మెల‌సి ఉండాల‌ని కోరుకుంటున్నాన‌ని..21 ఏళ్ల నుంచి ఇద్ద‌రం క‌ల‌సి ఉంటున్నాం.. 12 ఏళ్లుగా వివాహ బంధంలో ఉన్నాం.. హ్యాపీ వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ.. అంటూ అన‌సూయ కాప్ష‌న్ పెట్టింది.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే అన‌సూయ పుష్ప‌లో దాక్షాయ‌ణిగా అల‌రించ‌గా.. త్వ‌ర‌లోనే పుష్ప 2వ పార్ట్‌లోనూ ఈమె న‌టించ‌నుంది. ఈ మ‌ధ్యే విడుద‌లైన ఖిలాడి మూవీలోనూ అన‌సూయ న‌టించింది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ ప‌రిచింది. ఇక భీష్మ ప‌ర్వం అనే మ‌ళ‌యాళం మూవీతో అన‌సూయ మాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వ‌నుంది. అలాగే గోపీచంద్ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌లో ఈమె న‌టించింది. దీంతోపాటు రంగ మార్తాండ అనే మూవీలోనూ న‌టిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment