Viral Video : పోలీసుల‌కు మ‌స్కా కొట్టి.. బైక్ మీదున్న వ్య‌క్తి ఎలా త‌ప్పించుకున్నాడో చూడండి..!

June 1, 2022 8:55 PM

Viral Video : ర‌హ‌దారిపై బైక్ మీద ప్రయాణం చేస్తున్న‌ప్పుడు మ‌న ద‌గ్గ‌ర ప‌త్రాలు అన్నీ ఉంటే ఓకే. లేదంటే మ‌ధ్య‌లో ఎక్క‌డైనా ట్రాఫిక్ పోలీసులు ఆపి చెక్ చేస్తే ఇబ్బందులు త‌ప్ప‌వు. అయితే ఇలాంటి సంద‌ర్భాల‌లో కొంద‌రు ట్రాఫిక్ పోలీసుల నుంచి త‌ప్పించుకునే ప్రయ‌త్నం చేస్తుంటారు. కొంద‌రు పోలీసులు ఉన్నార‌న్న విష‌యాన్ని ముందుగానే ప‌సిగ‌ట్టి వారి దగ్గ‌ర‌కు రాకుండానే ముందుగానే యూ ట‌ర్న్ తీసుకుని వెళ్తుంటారు. ఇక కొంద‌రు పోలీసులు వెంట ప‌డ్డా దొర‌కకుండా ముందుకు సాగుతారు. అయితే ఆ వ్య‌క్తి మాత్రం పోలీసుల‌ను ఒక రేంజ్‌లో మోసం చేశాడు. వారికి దొరికిన‌ట్లే దొరికి వెంట‌నే అక్క‌డి నుంచి యూ ట‌ర్న్ తీసుకుని పారిపోయాడు. ఈ సంఘ‌ట‌న తాలూకు వీడియో వైర‌ల్‌గా మారింది.

ర‌హ‌దారిపై బైక్ మీద స్పీడ్‌గా వెళ్తున్న ఓ వ్య‌క్తిని ఆపేందుకు వెనుకాలే ఇద్ద‌రు పోలీసులు ఇంకో బైక్ మీద వ‌చ్చారు. అయితే ఆ వ్య‌క్తి రోడ్డుకు అవ‌త‌లి వైపు ఆగాడు. దీంతో అత‌ను ఆగాడులే అని చెప్పి పోలీసులు కాస్త లైట్ తీసుకున్నారు. అయితే వారు అత‌న్ని చేరుకునేలోపే అత‌ను వెంట‌నే బైక్‌ను యూట‌ర్న్ తీసి అక్క‌డి నుంచి మ‌ళ్లీ వెన‌క్కి వ‌చ్చాడు. ఇక అత‌ని కోసం ఇంకో ఇద్ద‌రు పోలీసులు వెంబ‌డించినా ఫ‌లితం లేక‌పోయింది. అత‌ను చాలా తెలివిగా అక్క‌డి నుంచి త‌ప్పించుకున్నాడు. కాగా సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియోను ఇప్ప‌టికే చాలా మంది వీక్షించారు.

see how a man escaped from traffic police Viral Video
Viral Video

ఈ వీడియోకు గాను ఇప్ప‌టికే 19 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. 1.20 ల‌క్ష‌ల‌కు పైగా లైక్ చేశారు. దీంతో సోష‌ల్ మీడియాలో ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. చాలా మంది నెటిజ‌న్లు ఈ వీడియోకు గాను కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇది హాలీవుడ్ లెవ‌ల్ స్టంట్ అని కొంద‌రు కామెంట్ చేయ‌గా.. ఈ స్టంట్‌ను పెట్టి ధూమ్ 5 సినిమా తీయాల‌ని కొంద‌రు కామెంట్లు చేశారు. చాలా మందీ ఈ వీడియోను చూసి ఎంజాయ్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by memes | comedy (@ghantaa)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment