Samantha : అందులోనూ ఫెయిలైన సమంత.. ఇక పని అయిపోయినట్లేనా..?

May 31, 2022 9:39 AM

Samantha : అక్కినేని వారి కోడలిగా ఉండడం ఎంత ప్లస్‌ పాయింట్‌ అవుతుందో అందరికీ తెలిసిందే. అలాంటి స్థానంలో ఉంటే ఆఫర్లు అడగకున్నా వస్తాయి. అయితే అన్నీ తెలిసే సమంత.. చైతన్యకు విడాకులు ఇచ్చింది. అది ముగిసిన అధ్యాయం. కానీ ఇప్పుడిప్పుడే సమంతకు తన బలం ఏంటో తనకు తెలిసి వస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఆమె లేటెస్ట్‌ మూవీని అసలు ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. కాతువాకుల రెండు కాదల్‌ పేరిట తమిళంలో.. కణ్మణి రాంబో ఖతీజా పేరిట తెలుగులో రిలీజ్‌ అయిన సమంత మూవీ అసలు వచ్చి వెళ్లినట్లు కూడా చాలా మందికి తెలియదు. ఈ క్రమంంలోనే ఈ మూవీ ఓటీటీలోనూ రిలీజ్‌ అయింది. అయితే థియేటర్లలో అత్యంత డిజాస్టర్‌ అయిన ఈ మూవీ ఓటీటీలోనూ ఫ్లాప్ అయింది. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఈ మూవీ గురించి అసలు ఎవరూ మాట్లాడుకోవడం లేదు. థియేటర్లలో అయితే సినిమా వచ్చినట్లు కూడా చాలా మందికి తెలియదు. కారణం.. ప్రమోషన్స్ ను నిర్వహించకపోవడమే. మీడియాతో ప్రెస్‌ మీట్స్‌ పెడితే తనకు ఎక్కడ ఇబ్బందికరమైన ప్రశ్నలు వేస్తారేమోనని సమంత భయపడి ఉండవచ్చు. కనుకనే ప్రమోషన్స్‌లోనూ ఆమె పాల్గొనలేదు. దీంతో మొదటికే మోసం వచ్చింది. సినిమా రిలీజ్ అయిన విషయమే చాలా మందికి తెలియలేదు. ఇక ఈ మూవీ థియేటర్లలో విడుదలైన మొదటి రోజు కేవలం 20 శాతం థియేటర్లలోనే అక్కడక్కడా ప్రేక్షకులు కనిపించారు. 80 శాతం థియేటర్లలో ఒక్క టిక్కెట్‌ కూడా బుక్‌ కాలేదు. దీంతో షోలను రద్దు చేశారు. వేరే సినిమాలను ప్రదర్శించారు. ఇలా సమంత తన లేటెస్ట్‌ మూవీతో అప్రతిష్టను మూటగట్టుకుంది.

Samantha latest movie viewers not interested what is happening
Samantha

ఇక ఈ మూవీ ఇటీవలే ఓటీటీలోనూ రిలీజ్‌ అయింది. అయితే దీనికి కూడా పెద్దగా వ్యూస్‌ రాలేదు. ఈ మూవీని చూసేందుకు ఎవరూ ఆసక్తిని చూపించడం లేదు. దీంతో సమంత మూవీ తొలిసారిగా భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ క్రమంలోనే సమంత పని అయిపోయిందని.. ఇక ఆమె సినిమాలను ఎవరూ చూడరని అంటున్నారు. అయితే అక్కినేని కోడలిగా ఉండి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేదని.. ఫ్యాన్స్‌ ఎలాగైనా సరే ఆమె సినిమాను ప్రమోట్‌ చేసి ఉండేవారని అంటున్నారు. అయితే ఈ మూవీలాగే భవిష్యత్తులో విడుదలయ్యే ఆమె మిగిలిన సినిమాలకు కూడా అలాగే జరిగితే.. సమంత సినిమా కెరీర్‌ ముగిసినట్లే అని భావించవచ్చు. ఇక ఆమె నటిస్తున్న యశోద సినిమా ఆగస్టులో రిలీజ్‌ కానుంది. మరి ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని రాబడుతుంది.. సమంత మళ్లీ నిలదొక్కుకుంటుందా.. లేక ఆ మూవీతో సినిమా కెరీర్‌ ఇక ముగింపు దశకు చేరుకుంటుందా.. అన్నది త్వరలో తేలనుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment