Viral Video : వామ్మో.. ఏం టాలెంట్ రా బాబూ.. దోశ విసిరితే నేరుగా ప్లేట్‌లోనే ప‌డుతోంది.. వీడియో..!

May 28, 2022 5:17 PM

Viral Video : మ‌న‌లో చాలా మందికి దోశ‌లు అంటే ఎంతో ఇష్టంగా ఉంటుంది. అందుక‌నే త‌ర‌చూ ర‌క‌ర‌కాల దోశ‌ల‌ను తింటుంటారు. ఆనియ‌న్ దోశ‌, మ‌సాలా దోశ‌, ఉప్మా దోశ‌, పెస‌ర‌ట్టు.. ఇలా ర‌క‌ర‌కాల దోశ‌లు మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. కొంద‌రు వీటిని ఇళ్ల‌లోనే చేసుకుంటుంటారు. కానీ కొంద‌రు వీటిని తినేందుకు బ‌య‌ట‌కు వెళ్తుంటారు. అయితే ఇంట్లో క‌న్నా బ‌య‌ట అందించే దోశ‌లు కాస్త రుచిగానే ఉంటాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా బ‌య‌ట హోట‌ల్స్‌లో కన్నా ర‌హదారుల ప‌క్క‌న పెట్టే తోపుడు బండ్ల‌పైనే దోశ‌లు భ‌లే రుచిగా ఉంటాయి. మొన్నా మ‌ధ్య ల‌లితా జువెలర్స్ య‌జ‌మాని కూడా ఇలాగే ర‌హ‌దారి ప‌క్క‌న బండిపై దోశ‌ల‌ను తిని అంద‌రినీ షాక్ కు గురి చేశారు. అయితే దోశ‌లు తినేందుకు ఎక్క‌డికైనా వెళ్లండి.. కానీ అక్క‌డికి వెళితే.. కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఎందుకంటే అక్క‌డ దోశ‌లు వేసే మాస్ట‌ర్ అల్లాట‌ప్పా వ్య‌క్తి కాదు. దోశ వేసి నేరుగా మీ ప్లేట్‌లోకే విసురుతాడు. అవును.. దాన్ని ప‌ట్టుకుని తినాలి. లేదంటే మిస్ అవుతారు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే..

ముంబైలోని దాదర్ ఈస్ట్ అనే ప్రాంతంలో హింద్ మాతాలోని ముత్తు దోశ సెంట‌ర్లో ఓ దోశ మాస్ట‌ర్ ప‌నిచేస్తున్నాడు. అయితే ఆయ‌న‌కు వికెట్ కీప‌ర్ దోశావాలా అనే పేరుంది. ఎందుకంటే ఆయ‌న దోశ వేశాక నేరుగా మ‌న ప్లేట్‌లోకే విసిరేస్తాడు. ప‌ద్ధ‌తిగా మ‌న‌కు ప్లేట్‌లో పెట్టి ఇవ్వ‌రు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న దోశ వేసి విస‌ర‌గానే నేరుగా వ‌చ్చి ప్లేట్‌లోనే ప‌డుతుంది. బ‌య‌ట ప‌డ‌దు. అదీ ఆయ‌న స్పెషాలిటీ. ఈ క్ర‌మంలోనే ఆయ‌న దోశ‌లు అలా వేస్తూ ప్లేట్‌లోకి వాటిని విసురుతున్న వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. చాలా మంది ఆ దోశ మాస్ట‌ర్ టాలెంట్‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోతున్నారు. దోశ‌ల‌ను ఇలా కూడా విస‌రొచ్చా.. అని షాక‌వుతున్నారు.

master throwing Dosa directly into plate Viral Video
Viral Video

కాగా ఆ దోశ సెంట‌ర్ అక్క‌డ ఎంతో ఫేమ‌స్. ఆ మాస్ట‌ర్ త‌యారు చేసే దోశ‌ల‌ను తినేందుకు చాలా మంది అక్క‌డికి వెళ్తుంటారు. ఈ క్ర‌మంలోనే అక్క‌డ ర‌క‌రకాల దోశ‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. క‌నుక మీరు ఎప్పుడైనా ముంబై వెళ్లినా.. లేదా అక్క‌డే ఉంటున్నా.. ఒక్క‌సారి ఆ దోశ‌ల‌ను ట్రై చేయండి. మ‌రిచిపోకండి..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment