చికెన్ తో బ్లాక్ ఫంగస్… దీనిలో నిజమెంత? నిపుణులు ఏమంటున్నారంటే?

May 31, 2021 11:34 AM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకవైపు కరోనా దాడి చేయడమే కాకుండా,మరో వైపు బ్లాక్ ఫంగస్ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ వైరస్ బారిన పడి చనిపోతున్నారు. ఇలాంటి సమయాలలో సామాజిక మాధ్యమాలలో తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వాట్సప్ గ్రూపులలో చికెన్ తినడం వల్ల బ్లాక్ ఫంగస్ వ్యాపిస్తుందని ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమందిని ఆందోళనకు గురి చేస్తోంది.

ఈ విషయం తెలిసిన వారు చికెన్ తినడానికి ఇష్టపడటం లేదు. ఈ క్రమంలోనే ఈ విషయం గురించి స్పందించిన ఇండియన్ కౌన్సిల్​ ఆఫ్​ మెడికల్ రీసెర్చ్​ (ఐసీఎంఆర్​) సీనియర్​ సైంటిస్ట్ డాక్టర్ అపర్ణ ముఖర్జీ మాట్లాడుతూ… వాతావరణంలో ఉండే ఫంగస్ కోళ్లకు, మనుషులకు వ్యాపిస్తుందని, అయితే కోళ్ల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది అనడంలో ఏమాత్రం వాస్తవం లేదని సైంటిస్ట్ డాక్టర్ అపర్ణ తెలిపారు.

బ్లాక్ ఫంగస్ అనేది అంటువ్యాధి కాదని, అలాంటప్పుడు ఇది కోళ్ల నుంచి మనుషులకు ఎలా వ్యాపిస్తుందని ఆమె స్పష్టత ఇచ్చారు. ఇది కేవలం అసత్య ప్రచారాలు మాత్రమేనని ఇలాంటి ప్రచారాలు నమ్మి చికెన్ తినడానికి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ అపర్ణ ముఖర్జీ బ్లాక్ ఫంగస్ గురించి పూర్తి క్లారిటీ ఇచ్చారు. కాబట్టి చికెన్ నిరభ్యంతరంగా తినవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment