Adah Sharma : ఆ డ్రెస్ ఏంటి.. ఆ అవ‌తారం ఏంటి.. అదాశ‌ర్మ‌పై నెటిజ‌న్ల విమ‌ర్శ‌లు..!

May 25, 2022 10:31 AM

Adah Sharma : సినిమా ఆఫ‌ర్లు లేని చాలా మంది హీరోయిన్లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాపై ప‌డ్డారు. అందులో త‌మ గ్లామ‌ర‌స్ ఫొటోల‌ను షేర్ చేస్తూ నెటిజ‌న్ల‌కు ట్రీట్ ఇస్తున్నారు. అయితే అంత వ‌ర‌కు బాగానే ఉంది. కానీ కొంద‌రు హీరోయిన్లు మాత్రం గ్లామ‌ర్ పేరిట అడ్డ‌మైన డ్రెస్‌ల‌ను ధ‌రిస్తున్నారు. అలాంటి వారిలో అదాశ‌ర్మ ముందుంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈమె అప్పుడ‌ప్పుడూ ధ‌రించే డ్రెస్‌లు వివాదాస్ప‌దం అవుతుంటాయి. గ‌తంలో ఈమె ర‌న్నింగ్ కారు ప‌క్క‌న డ్యాన్స్ చేసి అభాసుపాలైంది. ట్రాఫిక్ పోలీసులు కూడా ఈమెకు క్లాస్ పీకారు. అయిన‌ప్ప‌టికీ ఈమె త‌న ప‌ని తాను చేసుకుపోతుంది. కానీ అలా చేయ‌డం మాన‌డం లేదు.

ఇక తాజాగా అదాశ‌ర్మ లేత ఆకుప‌చ్చ‌, ప‌సుపు రంగులో ఉన్న డ్రెస్‌ను ధ‌రించింది. ఆ డ్రెస్ అదో మాదిరిగా ఉంది. ఈ క్ర‌మంలోనే ఆ ఫొటోల‌ను ఆమె షేర్ చేయ‌గా.. అవి వైర‌ల్‌గా మారాయి. అయితే ఆమె ధ‌రించిన డ్రెస్ మ‌రీ ఎబ్బెట్టుగా ఉండ‌డంతో నెటిజ‌న్లు ఆమెను ఒక ఆట ఆడుకుంటున్నారు. ఆ డ్రెస్ ఏంటి.. ఆ అవ‌తారం ఏంటి.. అని ఆమెను విమ‌ర్శిస్తున్నారు.

netizen angry on Adah Sharma for her latest posts
Adah Sharma

గ్లామ‌ర‌స్ డ్రెస్ ధ‌రించావు స‌రే.. కాస్త బెట‌ర్‌గా ఉండే డ్రెస్ ధ‌రిస్తే ఏమొచ్చింది.. మ‌రీ చండాలంగా ఉన్నావు.. అని అదాశ‌ర్మ‌ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

ఇక అదాశ‌ర్మ టాలీవుడ్‌కు హార్ట్ ఎటాక్ అనే మూవీ ద్వారా ప‌రిచ‌యం కాగా.. త‌రువాత కూడా ప‌లు సినిమాల్లోనూ న‌టించింది. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్ వంటి సినిమాల్లో న‌టించింది. కానీ ఈమెకు ల‌భించింది సెకండ్ హీరోయిన్ ఆఫ‌ర్లే. అలాగే తెలుగుతోపాటు ప‌లు త‌మిళ‌, క‌న్న‌డ సినిమాల్లోనూ ఈమె యాక్ట్ చేసింది. కానీ అవేవీ పెద్ద‌గా హిట్ కాలేదు.

కాగా అదాశ‌ర్మ ప్ర‌స్తుతం ఓ మార్ష‌ల్ ఆర్ట్స్ మూవీలో న‌టిస్తోంది. అందుకు గాను ఆమె విదేశాల్లో ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ కూడా తీసుకుంటోంది. ఇక ఈమెకు ఇప్ప‌టికే క‌ర్ర‌సాము, క‌రాటే లాంటి విద్య‌ల్లో నైపుణ్యం ఉంది. దీంతో ఈమెకు ఇది ప్ల‌స్ పాయింట్‌గా మార‌నుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment