Upasana : లగ్జరీ కారును కొన్న ఉపాసన.. ధర ఎంతో తెలుసా..?

May 24, 2022 3:33 PM

Upasana : మెగా కోడలు ఉపాసన ఈమధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈమె ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్నానని చెప్పి అందరికీ షాకిచ్చారు. అయితే టెస్ట్‌ చేయించుకుంటేనే గానీ అసలు విషయం బయట పడలేదని.. తనకు కోవిడ్‌ లక్షణాలు స్వల్పంగానే ఉన్నందున అసలు ఆ విషయం తెలియలేదని ఆమె స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం తాను కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నానని అన్నారు. అయితే ఉపాసన తాజాగా ఓ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. అందులో షికారు చేస్తూ తీసుకున్న వీడియోను ఆమె షేర్‌ చేశారు.

మెగా కోడలు ఉపాసన కొణిదెల తాజాగా ఆడి కంపెనీకి చెందిన ఆడి ఇ ట్రాన్‌ అనే కారును కొన్నారు. ఇది విద్యుత్‌ వాహనం. ధర రూ.1.10 కోట్ల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ క్రమంలోనే ఈకారును కొన్న ఆమె అందులో ప్రయాణించిన అనుభూతి గురించి వివరించారు.

Upasana bought Audo e-tron car
Upasana

ఆడి ఇ ట్రాన్‌ కారు చాలా అద్భుతంగా ఉందని ఉపాసన పేర్కొన్నారు. ఇది లగ్జరీని, సుస్థిరతను అందిస్తుందని, చక్కని ఆవిష్కరణను ఆడి అందించిందని, చాలా సౌకర్యవంతంగా కూడా ఈ కారు ఉందని ఆమె తెలిపారు. ఈమేరకు ఆమె ఈ విషయం గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ పెట్టారు. ఈ కారు తన ప్రయాణాలకు అనువుగా ఉంటుందని తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment