Vijay Devarakonda : విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత ప్ర‌యాణిస్తున్న కారు లోయ‌లో ప‌డిందా..? అస‌లు విష‌యం ఏమిటి..?

May 24, 2022 12:14 PM

Vijay Devarakonda : విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత‌లు హీరో హీరోయిన్లుగా ఖుషి అనే చిత్రం ఇటీవ‌లే ప్రారంభ‌మైన విష‌యం విదిత‌మే. శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అప్ప‌ట్లో వ‌చ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఖుషి టైటిల్‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఇందులో విజ‌య్‌, సమంత ఇద్ద‌రి ఫ‌స్ట్ లుక్‌ను ఇటీవ‌లే విడుద‌ల చేశారు. దీంతో ఆ ఫోటో వైర‌ల్‌గా మారింది. అయితే తాజాగా ఓ సంచ‌ల‌న వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. స‌మంత‌, విజ‌య్ ఖుషి సినిమా షూటింగ్ ముగించుకుని వ‌స్తుండ‌గా.. వారు ప్ర‌యాణిస్తున్న కారు లోయ‌లో ప‌డింద‌ని.. వారికి తీవ్ర గాయాలు అయ్యాయ‌ని.. దీంతో వారు హాస్పిట‌ల్‌లో చేరి చికిత్స పొందుతున్నార‌ని.. వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే దీనిపై ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ క్లారిటీ ఇచ్చారు.

స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ కారులో ప్ర‌యాణిస్తూ ప్ర‌మాదానికి గుర‌య్యారు.. అన్న వార్త‌ల‌పై ఖుషి ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో స్పందించారు. అదంతా ఫేక్ న్యూస్ అని.. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుని విజ‌య్ ముంబైకి చేరుకోగా.. స‌మంత హైద‌రాబాద్‌కు వ‌చ్చింద‌ని.. క‌నుక ఆ వార్త‌ల్లో నిజం లేద‌ని.. వాటిని న‌మ్మ‌కూడ‌ద‌ని.. అన్నారు.

Vijay Devarakonda and Samantha car accident is it true
Vijay Devarakonda

ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రోవైపు పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న జేజీఎం (జ‌న‌గ‌ణ‌మ‌ణ‌) అనే చిత్ర షూటింగ్ కోసం ముంబైకి వెళ్ల‌గా.. స‌మంత య‌థావిధిగా హైద‌రాబాద్‌కు వ‌చ్చేసింది. ఈమె ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న య‌శోద చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం కొన‌సాగుతోంది. ఈ మూవీని ఆగ‌స్టులో రిలీజ్ చేయ‌నున్నారు. అలాగే స‌మంత న‌టిస్తున్న శాకుంత‌లం అనే మూవీ కూడా ఈ ఏడాదే విడుద‌ల కానున్న‌ట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment