ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ పొరపాట్లను అసలు చేయకూడదు..!

January 11, 2022 11:18 AM

సాధారణంగా ప్రతి ఒక్క గ్రామంలోనూ ఆంజనేయస్వామి ఆలయం మనకు దర్శనమిస్తుంది. ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మనకు ఎంతో ధైర్యాన్ని, బలాన్ని కల్పిస్తాడని ప్రతి ఒక్కరి నమ్మకం. అందుకోసమే భయంతో ఉన్న వారు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల వారికి ఎంతో ధైర్యం కలుగుతుందని భావిస్తారు. ఆంజనేయుడు, హనుమంతుడు, భజరంగబలి, వాయుపుత్రుడు అని వివిధ రకాల పేర్లతో పిలువబడే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు కొన్ని పొరపాట్లు అసలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. మరి ఆ పొరపాట్లు ఏమిటో ఇక్కడ తెలుసుకుందామా.

సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తాం. కానీ ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఐదు ప్రదక్షిణాలు చేయాలి. ఈ విధంగా ప్రదక్షిణలు చేసే సమయంలో  ‘శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్’ అని చదువుతూ ప్రదక్షిణలు చేయాలి.

ఆలయానికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా స్వామివారి పాదాలను తాకి నమస్కరించకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి భూత ప్రేత పిశాచాలను తన పాదాల కింద అణచి వేస్తాడు కనుక పొరపాటున కూడా పాదాలను నమస్కరించకూడదు.

అదేవిధంగా ఏవైనా పూజాసామాగ్రిని ఏకంగా స్వామి వారికి మనం సమర్పించకూడదు. పూజా వస్తువులను పూజారి చేతికిచ్చి స్వామివారికి సమర్పించేలా చేయాలి. ముఖ్యంగా మహిళలు ఆంజనేయస్వామిని తాకరాదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచారి కనుక మహిళలు అసలు తాకరాదని పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment