Pawan Kalyan : ప‌వ‌న్ క‌ల్యాణ్, రేణు దేశాయ్‌.. క‌ల‌సిపోయారా..?

May 23, 2022 10:33 PM

Pawan Kalyan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తుతం ఓవైపు సినిమాలు, మ‌రోవైపు రాజ‌కీయాల‌తో ఎంతో బిజీగా ఉన్న విష‌యం విదిత‌మే. అయితే ఆయ‌న త‌న కుటుంబానికి మాత్రం త‌గినంత స‌మ‌యాన్ని ఎల్ల‌ప్పుడూ కేటాయిస్తుంటారు. ఇక తాజాగా ఆయ‌న త‌న మాజీ భార్య రేణు దేశాయ్, కొడుకు అకీరా నంద‌న్‌, కుమార్తె ఆద్య‌ల‌తో క‌లిసి ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

కాగా ఈ ఫొటోను చూసిన ప‌వ‌న్ అభిమానులు ఎంతో సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. కుమారుడి కోసం ప‌వ‌న్‌, రేణులు ఇద్ద‌రూ మ‌ళ్లీ ఒక్క‌ట‌య్యారా.. వారు క‌ల‌సి పోయారా.. అని ఆరాలు తీస్తున్నారు. అయితే ప‌వ‌న్ ప్ర‌స్తుతం త‌న భార్య అన్నా లెజినోవాతో క‌ల‌సి ఉంటున్న విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే రేణుకు విడాకులు ఇచ్చేశారు క‌నుక ఆమెతో ఉండ‌డం కుద‌ర‌దు. కానీ పిల్ల‌ల కోసం వీరు ఇలా అప్పుడ‌ప్పుడు క‌లుస్తుంటారు. దీంతో తాజాగా కూడా మ‌రోమారు వీరు ఇలా క‌లిశారు. చూస్తుంటే అకీరా నంద‌న్‌కు చెందిన ఏదైనా ప్రోగ్రామ్‌లో వీరిద్ద‌రూ పాల్గొని ఉంటార‌ని తెలుస్తోంది.

Pawan Kalyan and Renu Desai attended Akira Nandan program
Pawan Kalyan

ఇక అకీరా నంద‌న్ విష‌యానికి వ‌స్తే.. అత‌ని ఎత్తు ప్ర‌స్తుతం 6 అడుగుల 2 అంగుళాలు. తండ్రి క‌న్నా ఎత్తు ఎక్కువ ఉండ‌డ‌మే కాదు.. ఆయ‌న అడుగు జాడ‌ల్లోనూ అకీరా న‌డుస్తున్నాడు. మొన్నీ మ‌ధ్యే త‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా ర‌క్త‌దానం చేశాడు. ఇక అకీరా మార్ష‌ల్ ఆర్ట్స్‌, సంగీతంలోనూ దిట్టే. ఇటీవ‌లే మ‌హేష్ బాబు స‌ర్కారు వారి పాట సినిమాలోని క‌ళావ‌తి అనే సాంగ్‌ను అకీరా పియానోపై వాయించి అబ్బుర‌పరిచాడు. దీంతో అకీరా టాలెంట్‌కు అంద‌రూ ఫిదా అయ్యారు. అయితే చాలా రోజుల త‌రువాత ప‌వ‌న్‌, రేణు ఇద్ద‌రూ ఇలా ఒకే వేదిక‌పై క‌నిపించ‌డంతో.. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే వీరి ఫొటో నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now