వీడియో వైరల్: జిరాఫీకి ఆహారం పెట్టాడు.. చివరికి గాల్లో తేలాడు!

May 29, 2021 6:35 PM

కొన్నిసార్లు కొన్ని వీడియోలను చూస్తే ఎంతో నవ్వొస్తుంది. అలాంటి వీడియోలను పదేపదే చూస్తూ నవ్వడం ద్వారా మనస్సు ఎంతో కుదుటపడుతుంది.ప్రస్తుతం అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో ఒకటి వైరల్ గా మారింది. ఈ వీడియో చూస్తే మాత్రం నవ్వకుండా ఉండలేరు. మరి ఆ ఫన్నీ వీడియో ఏమిటి? అందులో ఏముందో ఇక్కడ తెలుసుకుందాం.

సరదాగా మనం జూ వెళ్ళినప్పుడు అక్కడ బోర్డుపై జంతువులకు ఆహార పదార్థాలను పెట్టకూడదు అని రాసి ఉంటారు.కానీ ఆ బోర్డుని చూడగానే వాటికి ఆహారం అందించాలనే కుతూహలం మనలో ఎక్కువవుతుంది.ఈ క్రమంలోనే ఎంతోమంది తమ వెంట తెచ్చుకున్న వస్తువులను జంతువులకు ఆహారంగా ఇస్తుంటారు. అచ్చం అలాగే ఓ కుర్రాడు జూ లో ఉన్నటువంటి ఒక జిరాఫీకి ఆహారం పెట్టాలని భావించాడు. అందుకు అతని పేరెంట్స్ వారించకుండా దగ్గరుండి మరి జిరాఫీకి ఆకులను తినిపించారు. ఇక్కడే అసలైన ట్విస్ట్ దాగి ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Krishnan Swaminathan (@kswaminathan)

కుర్రాడు పెద్ద ఆకులను జిరాఫీకి తినిపిస్తున్న సమయంలో జిరాఫీ ఆకును నోటిలో పెట్టుకొని తన తలను పైకి ఎత్తింది. ఆ సమయంలోనే కుర్రాడు ఆకును వదలకుండ గట్టిగా పట్టుకోవడంతో ఒక్కసారిగా గాల్లో తేలాడు.అది చూసిన తన తల్లి గట్టిగా అరవడంతో వెంటనే తన తండ్రి అప్రమత్తమై తన కొడుకుని పట్టుకొని కిందకు దించారు. ఈ సంఘటన చూసిన తల్లి నవ్వు ఆపుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.మరెందు కాలస్యం ఆ ఫన్నీ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment